జగన్..పవన్ ఇద్దరూ ఓ ఛాన్స్ మిస్సయ్యారు




ప్రతిపక్షనేత జగన్..విపక్షమో..స్వపక్షమో ఇంకా పూర్తిగా క్లారిటీ రాని పవన్ కల్యాణ్ ఇవాళ ఒకే ఛాన్స్  మిస్సయ్యారు. ఇద్దరూ తమ నిబద్దతని..సమర్ధతని నిరూపించుకునే ఈ అవకాశం భవిష్యత్తులో వస్తుందేమో కానీ..ఎన్నికలకు ముందు మాత్రం దాదాపుగా రానట్లే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్న రాజకీయనేతలలో ముందు వరసలో ఉండేది వైఎస్ జగన్..ఎవరెన్ని కూతలు కూసినా..ఆ నినాదం అలా సజీవంగా ఉందంటే అది అతని పుణ్యమే(ఎవడికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు..). మధ్యలో అదేమైనా జిందాతిలిస్మాతా అన్న ఓ పేద్ద నాయకుడు ఢిల్లీలో ఎలా ఓ మూలకి నెట్టివేయబడ్డాడో అందరికీ తెలుసు..అలానే అదేమైనా సంజీవినా..ఇచ్చిన రాష్ట్రాలు ఏం  సాధించాయ్..హోదా ఇచ్చి రాయితీలు ఇవ్వకపోతే ఏం చేయాలి అన్న నోటితోనే ఇవాళ పేద్ద గొప్పగా..అఖిలపక్షసమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యనేత గురించీ అందరికీ తెలుసు..

ముందు జగన్ మిస్సైన ఛాన్స్ ఏదో చూద్దాం..ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఓ అన్ని పార్టీల మీటింగ్ పెడితే దానికి వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎవరూ హాజరుకాకపోవడం ఓ తప్పు..పవన్ కల్యాణ్ హాజరు కావడంతోనే దానికి బాగా కవరేజీ లభించిందనేది నిస్సందేహం..అన్ని పార్టీల నుంచి ఒకరో ఇద్దరో హాజరైతే..ఈయన ఏకంగా ముగ్గురు నలుగురు అనుచరులతో సహా వెళ్లడం మీటింగ్ ని హైజాక్ చేయడమే..సరే పిలిచారు కాబట్టి వెళ్లారు అదేం పట్టించుకోనక్కర్లేదు..కానీ వైఎస్ జగన్ తరపున ఎవరూ లేకపోోవడం  ఈ మీటింగ్ వరకూ చేసిన తప్పు..ఇన్నాళ్లూ హోదాపై రంకెలు వేసి ఇప్పుడు వేరే వ్యక్తి..అందులోనూ పెద్దగా ఏ పార్టీ ముద్రా పడని వ్యక్తి పెట్టిన మీటింగ్ కి వెళ్లకపోవడం తప్పిదమే...బహుశా టిడిపి ఉంది కాబట్టి వెళ్లమని సమర్ధించుకున్నా జనం అంగీకరించరు..ఇదే అక్కడకు జగన్ వెళ్లి ఉంటే..అక్కడ మాట్లాడి ఉంటే నిస్సందేహంగా ఎన్నో మార్కులు పడేవి


ఇక పవన్ మిస్సైన ఛాన్స్...ఇక్కడకు వెళ్లడం కాదు..వెళ్లినా టిడిపి-బిజెపి చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపకపోవడం..దీంతో టిడిపికి దగ్గరవుతాడేమో అన్న చిన్న సందేహం..తలెత్తింది..కానీ చంద్రబాబు అఖిలపక్షానికి దూరంగా ఉండటం ద్వారా దాన్ని చెరుపుకునే ప్రయత్నంలో తాేనే మరోసారి తప్పు చేశాడు..టిడిపి ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు కూడా వెళ్లి..హోదా కోసం మద్దతు తప్ప మీ పార్టీకి కాదు..మీ పార్టీ ఇన్ని తప్పుులు చేసింది అని అక్కడ మాట్లాడి ఉంటే..బంపర్ మార్క్స్ కొట్టేసి ఉండేవాడు..కానీ ఒక అఖిలపక్షానికి వెళ్లి..మరోదానికి వెళ్లకపోవడం పవన్ మిస్సైన ఛాన్స్ అయితే..ఒక్కదానికీ అటెండ్ కాకపోవడం జగన్ మిస్సైన ఛాన్స్..వీటి ఖరీదు ఏమిటనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది

Comments

  1. నాకున్న ఈ రెండు ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్తారా?

    1. ప్రజాధనంతో జీతం పుచ్చుకొనే కుటుంబరావు టీడీపీ ప్రతినిధిగా ఎలా వెళ్ళాడు?
    2. జాస్తి చెలమేశ్వర్ ఏ పార్టీ తరఫున సమావేశానికి హాజరు అయ్యాడు?

    ReplyDelete
  2. సాటి ఆంధ్రుడిగా

    ReplyDelete
    Replies
    1. ఉండవల్లి తన సమావేశానికి ఆంధ్రులు అందరూ రావాలని ఆహ్వానిస్తే జాస్తి చెలమేశ్వర్ ఒక్కడికే వినిపించిందా, ఏమి పాము చెవులు!

      Delete

Post a Comment