అణచుకున్న ఆక్రోశం..వంగవీటిలో బైటపడింది


ఎవడికి చెప్పి వెళ్లావ్..
ఏం ఎవడికి చెప్పి వెళ్లాలి...ఆయ్..రంగాగారి విగ్రహావిష్కరణకి ఎవడికి చెప్పెళ్లాలి..?

మొదటిది జగన్ వాయిస్ ఐతే..రెండోది వంగవీటి రాధాకృష్ణ వాయిస్..మొదటిది జరిగి చాలా రోజులైందంటున్నారు..రెండోది మాత్రం ఇప్పుడే( జనవరి 24,2018) బ్రేక్  అయింది..అంటే..మధ్యలో చాలా గ్యాప్ ఉండింది..ఓ తండ్రి విగ్రహావిష్కరణకు కొడుకు వెళ్లకూడదు అని జగన్ అని ఉంటే..అప్పట్లో కాంగ్రెస్ చేసిన తప్పే..ఇప్పుడు జగన్ చేసినట్లే..ఐతే ీఈయనేమో పెద్ద పార్టీ పెట్టేసుకున్నాడు..రాధా ఏమో పార్టీల కోసం వెతుక్కుంటున్నాడు..ఇదే రాధాకృష్ణ చేస్తోన్న తప్పు..కనీసం ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలి..

కానీ రాధాకృష్ణ మాత్రం అదేం చేయకుండా..పార్టీల కోసం చూస్తున్నట్లు( ప్రస్తుతానికి) కన్పిస్తున్నారు. ఓ వైపు రాధా-రంగా మిత్రమండలి ద్వారా సేవ చేస్తామని చెప్తున్నారు..అధికారం లేని సేవలకు గుర్తింపు దక్కదు..పనులూ జరగవు..అలానే తన బద్ద విరోధి కుటుంబం ఉన్న పార్టీలోకి వెళ్లడం కూడా ఆయనకి మనస్కరించకపోవచ్చని కొంతమంది చెప్తున్నారు..ఆయన ముందున్న దారి ( ఓవేళ రాజకీయ పార్టీలలోకి వెళ్లాలనుకుంటే) ఒకటి కాంగ్రెస్, ఇంకోటి జనసేన..మొదటిది పాత పార్టీ..రెండోది కొత్త పార్టీ..ఇందులో జాయినైతే..భేషుగ్గా ఆ పార్టీకి ఒక బలమైన కాండిడేట్ తో పాటు..రాష్ట్రంలో మరో పెద్ద నేత పార్టీలో చేరాడనే సంకేతం ఇవ్వచ్చు.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికి వస్తే..వంగవీటి రాధాకృష్ణ ఎటూ 2014లో ఓడిపోయాడు కాబట్టే..ఇలా బైటికి వెళ్తానన్నా కూడా పట్టించుకోలేదని లేటెస్ట్ టాక్..గెలిచినవాళ్లకే కొంతమందికి టిక్కెట్లు ఇచ్చే గ్యారంటీ లేని పరిస్థితిలో వంగవీటికి టిక్కెట్ కన్ఫామ్ చేయలేదని..అందుకే ఇలా పొమ్మనలేక పొగపెట్టారని కూడా అంటారు..కానీ కొంతమంది మాత్రం రాధాకృష్ణకి ఎప్పట్నుంచో పార్టీలోనుంచి వెళ్లాలనే ఉందని..అందుకే ఛాన్స్ కోసం చూసి బైటపడ్డారని వాదిస్తారు. ఐతే విలేకరులను పిలిచింది..తన వాదన..వేదన వెళ్ళగక్కడానికే అయినప్పుడు వాళ్లు ఏ ప్రశ్నా అడగకుండా అలా ఏం చెప్తే అదే రాసుకుంటారనుకోకూడదు..బ్యాలెన్స్ కోల్పోయి..షౌటింగ్ కి దిగాడు.. ఐతే ఎన్నాళ్లనుంచి ఉందో మరి..తన ఆక్రోశం అంతా అలా బైటపడిందని సర్దిచెప్పుకోవాల్సిందే

Comments