మార్చి1కి ముందు మోడీ మాస్టర్ స్ట్రోక్..నల్లచొక్కాతో చంద్రబాబు స్వాగతం


రైల్వేజోన్ ఇచ్చేశాం..ఇక తన్నుకు చావండి అన్నట్లుగా ఫిబ్రవరి 27 రాత్రి 8 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌ల ో ఉన్న ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రైల్వే జోన్  ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన ఎందుకు చేశారో తెలుసు..దానిపై పొలిటికల్ లీడర్ల  స్పందనా ముందే అంచనా వేయవచ్చు..ఐతే టిడిపి ధోరణి మాత్రం ఇంకాస్త ముందుకు వెళ్లి..అసలీ జోనే వద్దన్నట్లుగా ప్రవర్తించడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే..


రైల్వేజోన్ ఇస్తామన్నారు కానీ..ఏఏ షరతులతో కూడిన జోన్ కావాలో ఎప్పుడూ ఎవరూ ప్రకటించలేదు..మనవి తీసుకెళ్లి ఒడిశాలో కలిపారు..దీంతో విభజన నాటి అన్యాయమే మరోసారి జరిగిందంటూ మహా మేధావి ఒకరు ట్విట్టర్లో అదే పనిగా శోకండాలు పెడుతున్నాడు..ఇంతకీ ఆయనకి అసలు ఈ సమాచారం అర్ధం చేసుకునేంత జ్ఞానం ఉందా..అయినా ఇచ్చిందే తీసుకోండన్న మోడీకి తలొగ్గి నాలుగేళ్లు ఆ పంచనే పడి ఎంజాయ్ చేసినప్పుడు తెలీదా ఇలాంటివే జరుగుతాయని..మీరు కలిసి ఉన్నప్పుడు స్పెషల్ ప్యాకేజీని ఓ ఆర్ధరాత్రి ప్రకటించగానే...తెల్లారకుండానే
స్వాగతించమన్నదెవరు..బిజెపికి సంబంధించిన మీ వర్గపు నేతలు ఏపీకి వచ్చినప్పుడల్లా సాగిలబడి..సన్మానాలు చేయమన్నదెవరు..
అప్పుడు ఆ ప్యాకేజీ మీకు పరమాన్నం అయితే..ఇప్పుడీ జోన్ కూడా జిలేబీనే..ఐనా ఎటూ మోడీని జనం సాగనంపుతారని చెప్తున్నారు కదా..రాహుల్ ప్రధాని కాగానే హోదా ఇస్తారు..అలానే ఈ  జోన్‌లో కూడా మార్పులు చేయమని చెప్పండి..ఢిల్లీలో చక్రం తిప్పే సామర్ధ్యం ఉంది కదా..ఇప్పుడూ అలానే తిప్పండి సార్..ఒక్కసారి మీరింకా ఎన్డీఏలోనే ఉఁటే..ఈ ప్రకటనకి ఎంత హడావుడి చేసేవాళ్లు..తెలుగుజాతి ఎంత అదృష్టం చేసుకుందని నమ్మబలికేవాళ్లు..అలాంటి మీకు ఈ జోన్ ప్రకటనకి నిరసన తెలిపే హక్కు ఉందా. ? మీరు చెప్పే కారణం ఎన్నికలు వస్తున్నాయని ఇలా చేశారంటారా..మరి మీరు ఎన్నికలు వస్తున్నాయని కాదా..ఎన్డీఏ నుంచి బైటికి వచ్చింది?

Comments