ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్..తెలంగాణలో ఎంతమందికి లాభమో చూద్దామా


దేశవ్యాప్తంగా రైతులందరికీ (రెండు హెక్టార్లలోపు) ఏటా ఆరువేల రూపాయలంటూ ఘనంగా ప్రకటించిన స్కీమ్ పిఎంకేఎస్ఎన్..మరి నిజంగా ఇది అందరికీనా..కానే కాదు.మొదట్లోనే నాలుగు ఎకరాల్లోపు రైతులని చెప్పేశారు..ఇక ఆ తర్వాత జరిగి చిత్రాలు చూడండి..ఒక్క తెలంగాణ లెక్కే చూడండి..ఇక్కడ 47లక్షలమంది రైతులకు ఈ ప్రభుత్వం రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తున్నామని చెప్తోంది..అందులో ఇప్పుడీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏటా ఆరువేల రూపాయలు వచ్చేదెంతమందికి అంటే..26లక్షలమందికి మాత్రమే

అంటే తెలంగాణ స్ఫూర్తితో తీసుకువచ్చిన పథకం..తెలంగాణలోని సగంమందికి పనికిరాదు. ఫిబ్రవరి 25నాటికి లిస్టు ప్రిపేర్ చేయాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇప్పటికే విజ్ఞప్తులు అనుకోండి..సూచనలు అనుకోండి..ఆదేశాలు అనుకోండి జారీ చేసేసింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కమిటీలు ఈ చెక్కుల పంపిణీపై పర్యవేక్షణ చేయబోతున్నాయ్. ప్రతి దశలో గ్రీవెన్స్ సెల్స్ పెట్టబోతున్నారు.(.ఇకనేం బోలెడంత ఉపాధి.) ఏ ఫిర్యాదు వచ్చినా రెండు వారాల్లోపు పరిష్కరించాలి..ఇదీ అంతే రెండు వారాలు అంటే ఖచ్చితంగా 14 రోజునే చేస్తారు..రెండ్రోజుల్లో చచ్చినా చూడరన్నమాట.

ప్రభుత్వశాఖల్లోని ఏదోక శాఖని దీనికి నోడల్ ఏజెన్సీగా చేయబోతున్నారు..అంటే డబ్బులు దండిగా పంపిణీ చేసే శాకపై అజమాయిషీ అంటే ఎవరు వద్దంటారు. స్కీమ్ సక్రమంగా అమలు చేసినవారికి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారట. రాష్ట్ర ప్రభుత్వాలే ఏ బ్యాంకులలో డబ్బు వేయాలో నిర్ణయించవచ్చు(ఇకనేం బ్యాంకుల లాబీయింగ్ మొదలు)

Comments