ఏయ్..మోడీ నీకు మూడే రోజులు డెడ్ లైన్..చంద్రబాబునాయుడిగారి ఛాలెంజ్


ఉదయం 8..రాత్రి 8 మధ్యలో పన్నెండు గంటలు..ఏపీ సిఎం చంద్రబాబు..ఆయన మద్దతుదారులు 3500మంది ఢిల్లీలో అదరగొట్టారు. ఈ మధ్యలో చంద్రబాబుగారు కనీసం 8 గంటలపాటు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ వయసులో అంటే 68ఏళ్లలో ఇంత యాక్టివ్ గా తన పట్టుదల చూస్తే..ఎవరికైనా ఆదర్శనీయమే. ఛానళ్లు కూడా దాదాపుగా ఆయన ప్రోగ్రామ్ ని కవర్ చేశాయ్. ఒకటో రెండో తప్పించి..బహుశా పెయిడ్ అయి ఉండొచ్చు.  ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో జరిగిన ఈ దీక్ష అనండి..పోరాటం అనండి..దేశం మొత్తం దృష్టిిని ఆకర్షించింది నో డౌట్

మొత్తం మీద చంద్రబాబుగారు తన నాలుగున్నరేళ్ల పాలనలో తాను బిజెపితో అంటకాగి చేసిన తప్పులను
కడిగేసుకోవడంలో అనండి, కప్పిపుచ్చుకోవడంలో అననీయండి చాలావరకు సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ప్యాకేజీ కావాలని తీసుకుని ఆ తర్వాత చివర్లో తాను రాజకీయంగా ఎదుర్కొనబోయే ఓటమిని ఊహించి..ఇలా ప్లేటు ఫిరాయించడం..దాన్ని సమర్ధవంతంగా ఇతరులపైకి నెట్టేయడం అంత సులభం కాదు

అది కేవలం చంద్రబాబుగారికే సాధ్యం. ఎందుకంటే, ఈ అంశంపై మనం ఏం రాసినా..ఎవరూ తిరిగి కామెంట్లు పెట్టలేరు..ఎందుకంటే వారి చెవుల్లో బాబుగారు వేసిన రంకెలు.చేసిన పనులు అందరికీ గుర్తున్నాయి..అరెస్టులు కూడా చేసిన వ్యక్తులే..ఇప్పుడు అదేం పట్టనట్లు..ఆ పని తాము చేయనట్లు..అప్పట్నుంచి ఇప్పటిదాకా హోదా పోరులో తమకే పేటెంట్ ఉన్నట్లు వ్యవహరించడం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లే
ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చిన నేతల లిస్టు కూడా  పెద్దదే..మోడీ భాషలో ఆయన్ని ఓడించడానికి ఏకమైన  పార్టీలు..కానీ ఎంత పెద్ద సర్పమైనా..చలి చీమలు చుట్టబెట్టాయంటే  అంతే సంగతులు..

కానీ ప్రోగ్రామ్ లో చంద్రబాబుగారు ఓ డైలాగ్ వేశారు..మూడు రోజులు  డెడ్ లైన్ పెడుతున్నా..తప్పు ఒప్పుకో అన్నారు..ఇది మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు..చంద్రబాబు పెట్టే డెడ్ లైన్లు..ఇఁకా ఎవరు లెక్క చేస్తున్నారు..ఈ మూడురోజుల్లో ఏం జరగాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నారో తెలీడం లేదు.ఇంతకుముందు వాళ్ల నేత కుటుంబరావ్ కూడా ఇలానే నెలరోజుల్లో భూమి కంపించే నిజాలు బైటపెడతా అన్నారు..మరింత వరకూ ఆ భూకంపం రాలేదు..ఇది కూడా అలాంటిదేనా..అలాంటిదే...అలాంటిదే సార్..!

Comments

  1. గతం లో హర్యానకు దేవీలాల్ అనే పెద్దమనిషి ఉండేవాడు .కుటుంబ వారసత్వ రాజకీయాలు ,కుల రాజకీయాలు చేసి తిరుగులేనివదయ్యాడు .అవినీతి ,అహంకారం ముదిరి కనుమరుగయ్యారు . ఎక్కడైనా కుటుంబ రాజకీయాల అంతిమ ఫలితం అదే. అంత వరకు సిద్దంతాలు కల వారు నిశ్శబ్దంగా ఉండాల్సిందే . స్వార్థం లేనంత వరకే నిజమైన గౌరవము,విలువ .తాయిలాలు వంకన ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికలు కోనెల వుంది తప్ప నిజమైన అభివృద్ధి లేదు.

    ReplyDelete

Post a Comment