జగన్ పై నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి..ప్రస్ట్రేషన్ కి సంకేతమేనా


ఒక పార్టీ ఏదోక స్లోగన్ తో ఎన్నికలకు వెళ్తుంది..ఒక్కోసారి అది జనాలకు నచ్చుతుంది..నచ్చదు.. కానీ ఇతర పార్టీ నేతలు వారి స్లోగన్లపై విమర్శలు చేయడం కాస్త తక్కువే..కానీ ఈసారి చంద్రబాబుగారు మాత్రం తనకోస్థాయి ఉందని మరిచిపోయి మరీ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం చూస్తుంటే..ఇది ఎన్నికల ఫలితాలకు ముందస్తు సూచనేమో  అన్పించక మానదు.. 2019 అసెంబ్లీ ఎన్నికలలో జగన్ గెలవవచ్చు..ఓడిపోవచ్చు..అది వేరే విషయం..
కానీ అన్న వస్తున్నాడంటూ ఆ పార్టీ ఓ స్లోగన్ పెట్టుకుంటే బాబుగారికి ఎక్కడో కాలిందట..అన్న కాదు దున్న వస్తున్నాడంటూ కామెంట్లు చేయడం తీవ్ర విమర్శలను ఎదుర్కొనేదే..

బాబు వస్తాడు జాబు తెస్తాడు..ఇది టిడిపి నినాదం అయితే..జగన్ పార్టీ విమర్సలు మామూలుగా రివర్స్ లోనే ఉండేవి బాబు వచ్చాడు జాబు పోయిందనో..బాబు పోతేనే జాబు వస్తుందనో..కానీ ఇలా నీచంగా జంతువులతో పోల్చుతూ వ్యాఖ్యానించడం మాత్రం ఖచ్చితంగా ఆయన మానసిక స్థితికి అద్దం పట్టేదే..ఏ సర్వే చూసినా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపిఏకి అనుకూలంగా రావడం లేదు..అలాని బిజెపి వచ్చేస్తుందని ఎక్కడా చెప్పడం లేదు..కానీ బాబుగారి ఆశయం మాత్రం నెరవేరదనే చెప్తున్నాయ్..పైగా అవి ఏపీలో చంద్రబాబుగారి పార్టీకి కేవలం 2-5 సీట్లు మాత్రమే వస్తాయంటూ చెప్తున్నాయ్..బాబు గారు వీటిని దొంగసర్వేలంటూ వ్యాఖ్యానించడం మామూలే..ఎందుకంటే..ఆయన చేస్తేనే అది  కా...రం..వేరేవాళ్లు చేస్తే అది వ్య...చారం... 

ఇప్పుడున్నది మోడీ బిజెపి అట..అటల్ బిజెపి కాదట.మరి ఇప్పుడున్నది బాబు టిడిపి ఎన్టీఆర్ టిడిపి కాదంటే ఎందుకు ఉలుకు..సరే మీ పార్టీ ..మీ ఇష్టం..అది వదిలేయండి..లగడపాటి సర్వే తెలంగాణలో ఎందుకు చేసారు..ఎన్నికలకు ముందే ఎందుకు బైటపెట్టారు..మూతి పళ్లూ రాలగొట్టించుకున్నారు..?
జగన్ అండ్ కో..ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు అంటే రాజకీయం అంటూ వాగిననోళ్లు..చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆయన భార్యే స్వయంగా ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పేసరికి మూతబడ్డాయెందుకు...
కులాల వారీగా పోస్టులు పంచుకున్న వైనం అందరికీ బట్టబయలు అయ్యాయ్ కదా..మరి ఎందుకు ఇప్పుడు పోలీస్ సంఘం ప్రతినిధులు జయరాం భార్య కామెంట్లపై స్పందించవు...

ఈ సీక్వెల్ ఇన్సిడెంట్స్ ఏం చెప్తున్నాయంటే..రానున్నవి దేశానికి (తెలుగు) గడ్డు రోజులనే..అందుకే ఇలా అన్నా దున్నా అంటూ నోరు జారుతున్నారు..చూస్తుండండి..దీనికి ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుందేమో నోటీసుల రూపంలో..

Comments