ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడికి పాపం ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఎలాంటి షాక్‌లు ఇస్తున్నారో

హీరోలు సూర్య, విక్రమ్, విజయ్, విశాల్ ఈ నలుగురూ తమిళ ఇండస్ట్రీలో అగ్రతారలని ఒప్పుకుంటారు కదా..అలాంటి  హీరోలకు బ్రేక్ ఇవ్వడమే కాకుండా..నటులుగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు బాల..తన సినిమాలే అదో టైపు. జనరల్ గా ఎవరూ టచ్ చేయని..చేద్దామనే ఆలోచనే రాని సబ్జెక్టులు తీయడమే కాకుండా వాటిని హిట్ చేయడం ఇతని స్పెషాల్టీ..
శేషు, నందా, శివపుత్రుడు,వాడు వీడు  ఈ నాలుగు సినిమాలలో నందా తప్ప అన్నీ డబ్ అయ్యాయ్ మనకి కూడా..
నందా మాత్రం నందమూరి కల్యాణ్ రామ్ ముచ్చటపడి తెలుగులో తీద్దామని షూట్ కూడా చేయించుకని వెనక్కి తగ్గాడు. ఇన్ని మంచి సినిమాలు చేసిన బాలకి కొద్దిగా మెంటల్ కూడా అంటారు. అందుకే హిట్లు తీసేటప్పుడు కూడా ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేసేవాడు..అలాంటిది 2011 తర్వాత ఇక సిినిమాలు తీయడం తగ్గించేశాడు..తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయ్. దీంతో బాల అంటేనే ప్రొడ్యూసర్లు పారిపోతున్నారట.

ఇలాంటి నేపధ్యంలో బాలకి ఓ గోల్డెన్ చాన్స్ వచ్చింది. అదే హీరో విక్రమ్ కొడుకుని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్. అది కూడా సూపర్ హిట్ అర్జున్ రెడ్డి రీమేక్ ...కాస్త బాల కథలకి దగ్గరగా ఉండే  ఈకథని అతగాడు ఇరగదీసేస్తాడని విక్రమ్ అంచనాలు సినిమా పూర్తయ్యేసరికి తలకిందులు అయ్యాయట. పైగా తెలుగు అర్జున్ రెడ్డి ఎలా ఉంటే అలా తీయమని చెప్తే..అందులో తన కాటికాపరి పైత్యం ప్రదర్సించాడట. దీంతో మొత్తం సీన్లు రీ షూట్ చేస్తున్న్నారని టాక్ అలా చేస్తున్నా పేరు మాత్రం బాలదే పెడుతుండటంతో..ఇంతకి మించిన అవమానం లేదని బాల ఫీలవుతున్నాడట

Comments