కోడిరామకృష్ణకి బానే ఉందే...అర్రర్రే..మా ప్లానంతా బెడిసికొట్టిందే..ఛానళ్ల నిట్టూర్పు

డైరక్టర్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటుడు, నిర్మాత కోడి రామకృష్ణకి ఆరోగ్యం బాగాలేదని ఓ న్యూస్ స్ప్రెడ్ అయింది. గచ్చిబౌలిలోని కాంటినెంటలో...కేర్ ఆస్పత్రిలోనే చేర్చించారని..వెంటిలేటర్ పైనే ఉన్నారంటూ కొ్న్ని చానళ్లు హడావుడి చేశాయ్..వెబ్ సైట్లు..అదే స్తాయిలో ఇక ఆయన కాసేపట్లో పైకి పోతారన్నట్లుగా రాసాయ్..కానీ సాయంత్రానికి పాపం అలా జరగలేదు..ఇది టివి న్యూస్ చానళ్లకి బాగా నిరాశ కలిగించింది

ఎందుకంటే, బ్రేకింగ్స్ లో ఏ  పాయింట్లు పెట్టుకోవాలి...తర్వాత ఫోన్ లైన్లో ఎవరితో మాట్లాడాలి..ఏ ఏ సినిమాల వీడియోలు కట్ చేయించుకోవాలి..కోడి లేరు అని టైటిల్ పెట్టాలా..లేక ఇకలేరు పెడితే చాలా అనుకుంటూ చాలా తర్ఝన భర్జనలు పడుతూనే ప్రోగ్రామ్‌లు తయారు చే సుకున్నారు..ఇది ఏ ప్రముఖుడు చనిపోయేముందైనా జరుగుతున్న తంతు( ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు).. ఎవరైనా చనిపోబోతున్నారంటే కాపాడటానికి ఉన్న దారులు వెతుకుతారు...తర్వాత వాళ్ల బంధువులకు ఫోన్లు..వగైరా కార్యక్రమాలు ఉంటాయ్..కానీ ఇక్కడి చానళ్లకి మాత్రం తమకే వారి గురించి అంతా తెలుసు..చూశారా మేమే ఈ న్యూస్ మీకు ఎక్స్  క్లుజివ్ గా ముందుగా అందిస్తున్నాం అని చెప్పుకోవడానికి తాపత్రయం..

ఏమైంది ఓ పావుగంట ల ేటుగా ఇస్తే..చచ్చిపోియినవాళ్ల మీద పేలాలు ఎందుకు ఏరుకోవడం..ఇదే పరిస్థితి మన ఇళ్లలో వాళ్లకి వస్తే కానీ మారమా...! పైగా ఆ మరణవార్త తర్వాత  మీ ఫీిలింగ్ ఏంటి..మీ అభిప్రాయం ఏంటి..మీకున్న అనుబంధం ఏంటి అనుకుంటూ చొప్పదంటు ప్రశ్నలు..ఎవరికైానా ఏ ఫీలింగ్ ఉంటుంది..దిగులుగా..బాధగానే కదా..మరణవార్తలపై స్పందన..అలా కాకుండా..ఏదో వాళ్ల బతుకులను ఆద్యంతం పరిశీలించినట్లుగా పేరాలకు పేరాలు రాసేయడం దాన్ని యాంకర్లు చదివేయడం..ఎన్నాళ్లీ శవాలపై  పేలాలు  ఏరడం

Comments

  1. మరి ఇవాళ న్యూస్ గురించి ఏమంటారు మాస్టారూ?

    ReplyDelete
    Replies
    1. నే చెప్పింది వాళ్ల ఆత్రం..ఆ రోజు రాత్రి వాళ్ల ఫీలింగ్ గురించి..అంతే కానీ అసలు వార్తలే ఇవ్వొద్దు అని కాదు..మనిషి చచ్చిపోకముందే...అంతా ప్రిపేర్ చేసుకుని..ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూడటమేంటని

      Delete

Post a Comment