రాహుల్ తెలుగువారి మనసులు గెలుచుకున్నాడు...ఓటర్ల సంగతి చెప్పలేం కానీ..!


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షత, పట్టుదలపై తెలుగుదేశంలో( ఆంధ్రప్రదేశ్)లో ఎవరికైనా డౌట్లు ఉంటే అవి నిన్నటితో తీరిపోయి ఉంటాయ్..తాను తిరుమలకి రావడం మొదటిసారి అయినా..(నాకు తెలిసి రాలేదు మరి) ఎకాఎకిన అంత తక్కువ టైమ్‌లో వేంకటేశుని సన్నిధికి చేరడం అంటే సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు..అసలంత వేగం ఎక్కడనుంచి వచ్చిందో..కానీ భలే ఎక్కేసాడండీ..3500మెట్లు..ఆ తోటల్లోకి చేరవేసే చివరి మెట్ల మార్గం దగ్గర ఆ విజువల్ చూడగానే..ఓసారి మళ్లీ తిరుమల వెళ్లాలన్నంత అనుభూతి కలిగింది..ఎందుకంటే అన్ని మెట్లు ఎక్కి చివరి మలుపు దగ్గరకి చేరిన తర్వాత వచ్చే రిలీఫ్ అనుభవించిన వారికే తెలుస్తుంది..







అలా వెళ్లడం..స్వామిని దర్శించుకోవడం..తిరిగి అదే ఊపులో కిందకు వచ్చి బహిరంగసభలో ప్రసంగం ఇవ్వడం..ఓ లీడర్ కి ఉండే లక్షణం అది..అలసట అనేది కన్పించకుండా..లక్ష్యం రాజకీయపరమైనది అయినా కూడా అనుకున్న పని పూర్తి చేసుకుని వెళ్లాడంటే శభాష్ అనకుండా ఉండలేం..ఒక్క ఛీ న్యూస్ తప్ప అన్ని చానళ్లూ ఆయన టూర్ ని హైలెట్ చేశాయ్..ఆ తర్వాత సభలో  ఆయన ఇచ్చిన హామీ కూడా తెలుగువారిని పూర్తిగా సంతృప్తి పరిచేదే..మద్యలో రఘవీరాయాదవ్ గారు చేసిన అనువాదం మైసూర్ పాక్ లో రాళ్లలాగా  ఇబ్బంది పెట్టింది కానీ..ఆ ఫ్లో అలా కంటిన్యూ అయితే ప్రసంగం సూటిగా జనాలకు చేరేది..
ఏపిలో ఏ పార్టీ గెలిచినా...డిల్లీలో మా పార్టీ అదికారంలోకి రాగానే..ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతాం..ఇది 125కోట్లమంది హామీ అని చెప్పడమే అందులోని నిబద్దతని చాటి చెప్తోంది..నీ పార్టీని కాదు రాజశేఖరా..నిన్ను చూసి ఓటేస్తా అన్న డైలాగ్‌లానే రాహుల్ కాంగ్రెస్ ని కాదు..నిన్ను..నీ మాటని చూసి ఓట్లేయాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు..ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్  పరిస్థితి ఫినిక్స్ లా లేవలేకపోవచ్చు..కానీ ఎస్..మనం కాంగ్రెస్ ని తిరిగి నమ్మొచ్చు అనే భావం కాస్తైనా కదులుతుందంటే..అది రాహుల్ గాంధీ వల్లనే..
ఐతే ఈయన ప్రసంగం గమనించినప్పుడు..ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అనే మాట మాత్రం కాంగ్రెస్ ఇక్కడ గెలవలేదనే వాస్తవాన్ని సూటిగా చెప్పినట్లైంది..అలానే టిడిపి గెలుస్తుందనే నమ్మకం కూడా ఆయన మాటలో కన్పించలేదు..అంటే..వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచినా..మాకు అభ్యంతరం లేదనే సంకేతం పంపించాడా రాహుల్.. తప్పకుండా ఈ మాట అనుకునే అవకాశం కల్పించాడు



Comments

  1. కేసీఆర్ లా మోసం చేసే పార్టీ కాదు. తెలంగాణా ఇస్తామన్నారు ఇచ్చారు. హోదా ఇస్తామంటే ఇచ్చే తీరతారు.

    ReplyDelete

Post a Comment