బాబూ సబ్బం..ఇక చాలు..జాయినైపో...! టిడిపిలో సీటిచ్చినా ఇవ్వకపోయినా !

చంద్రబాబుని ఓడించడానికి కుట్ర జరుగుతోందట..ప్రతిపక్షాన్ని గద్దెనెక్కించేందుకు బిజెపి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రమైన పరిస్తితిని క్రియేట్ చేస్తుందట..రాజకీయ ముత్తైదువ..వృధ్ధనారీ పతివ్రత ..ఇలా ఎన్ని బిరుదులు ఉంటే అన్నిటికి అర్హతలు ఎప్పుడో సాధించేసిన సబ్బం హరి..ఇప్పుడు కొత్తగా తన పాతపాటకి..హంగులు అద్ది మరీ రంగంలోకి రంగులేసుకుుని మరీ దిగేశాడు..ఒక్కటే రంగు మాత్రం మిగిలింది..అదే పసుపు రంగు..ఇప్పటికే అనేక సార్లు పార్టీలో చేరతా..చేరతా అంటున్నా..అటువైపు నుంచి సిగ్నల్ రాక..జంక్షన్లో నిలబడిపోయిన ఇతగాడు..ఇక టిడిపిలో జాయినైపోతే..ఇంకా సమర్ధవంతంగా ఆ పార్టీ స్టాండ్ తీసుకోవచ్చని చాలమంది ఫీలవుతున్నారు. ఎందుకంటే..తటస్థుడనే ముద్రతో ఎక్కడోచోట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏపీలో ఛాన్స్ ఉందని చెప్పాల్సి వస్తుందని..అదే ఆ ముద్ర లేకపోతే...రంంగంలో టిడిపికి ఎదురు లేదని చెప్పుకోవచ్చని..అడ్డంకులన్నీ తొలగిపోతాయనేది వారి అభిప్రాయం

పైన పెట్టిన శీర్షిక ...మూల శీర్షిక చూశారుగా..ఏపీ విత్ సబ్బం హరి అట..13 జిల్లాల టిడిపి కార్యకర్తలు మాట్లాడతారని చెప్పి..ఈయనగారి  సొంత విశ్లేషణే దాదాపు 15 నిిమిషాలు చేసి..వీలైనంతగ ా బాబు గారి భజనలో మునిగిపోయారు.
అసలు రాజకీయాల్లో ఏ పార్టీ గెలవాలని కోరుకోదు..
ఆయన చేసిన కామెంట్లలో కొన్ని చూద్దాం..1. తెలంగాణలో చంద్రబాబుని ఓడించామని బిజెపి వాళ్లు చెప్పుకున్నారు..అసలు ఎక్కడండీ ఈళ్లు ( బిజెపి) 175 సీట్లు కంటెస్ట్ చేస్తే..(అసలు తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఏమైనా గుర్తుందా సబ్బం నీకు) 174 సీట్లలో డిపాజిట్లు కోల్పోయి 1 సీటులో గెలిచారట..అలాంటి బిజెపి చంద్రబాబుని ఓడించామని ప్రచారం చేస్తారా..

సబ్బం హరిగారు మీకు మైండ్ బ్లాకైంది..ఛానల్ ఎటూ భజనే..మీదీ భజనే కాబట్టి 119 సీట్లు 175 ఐపోతాయా..పైగా చంద్రబాబుగారే ఎక్కడికెళ్లినా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నా పిలుపుతోనే బిజెపి ఓడిపోయిందంటూ డబ్బాలు కొట్టుకున్నారు కానీ బిజెపి వాళ్లు కాదు

2. ఢిల్లీలో చంద్రబాబుగారు దీక్ష చేసిన ప్లాట్‌ఫామ్ మామూలుది కాదు..రేపు  ఎన్డీఏ వచ్చినా..యూపిఏ వచ్చినా చంద్రబాబు గారే అత్యంత కీలకం అవుతారని చెప్పడానికి నాకెలాంటి సందేహం లేదు..దేశంలో ఉన్న పార్టీలన్నీ అక్కడికి వచ్చాయి..బాబుకి సపోర్ట్ ఇచ్చాయ్..
దేశంలో ఎన్ని పార్టీలున్నాయని మీ ఫీలింగ్..బిజూ పట్నాయక్ పార్టీ వచ్చిందా..జేడీయూ వచ్చిందా..ఇక మీకు ప్రతిపక్షాలుగా చెప్పుకునే టిఆర్ఎస్, వైఎస్సార్సీపీ  ఎటూ రావు..పోనీ మాయావతి వచ్చిందా..అక్కడ యూపిఏలో  ఉన్న పార్టీలే తిరిగి వచ్చాయి తప్ప..టిడిపికోసం ఎవరూ రాలేదు నాయనా..అంతెందుకు తమిళనాట పేరున్న పార్టీలలో ఏ పార్టీ చంద్రబాబుకి మద్దతు పలికిందో కాస్త చూపండి..డిఎంకే స్టాలిన్ కేవలం కాంగ్రెస్ కోసం వచ్చాడు తప్ప..మీతో అంటకాగే పరిస్తితే లేదు బ్రదర్
3. మూడు నెలల క్రితం వరకూ ఏపీలో పట్టణ ప్రాంతాలో టిడిపికి ఫేవర్ గా ఉందట..రూరల్‌లో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపికి గొంతు టూ గొంతు ఉందట( ఏమో ఆ మొహమాటం..ఇక్కడా టిడిపికే బలం అని చెప్పేసుకో) నెల క్రితం మాత్రం అన్నీ మారిపోయాయట..అందరూ టిడిపి వైపే చూస్తున్నారట..ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయట

ఇదీ ఆయనగారి పదినిమిషాల స్వగతం..ఇప్పుడు చెప్పండి..సబ్బం ఏ పార్టీలో జాయినైతే ఆయన వాదనని విన్పించగలడో..!




Comments

  1. It seems your article just reflects negative feelings on sabbam Hari, please try to analyse with more facts and unbiased

    ReplyDelete
  2. ఇంతకీ ఎవరీ సబ్బం హరి, 2014 లోక్సభ ఎన్నికలలో విశాఖపట్నం నుండి పోటీ చేసి అక్షరాలా 6,644 ఓట్లు తెచ్చుకున్న "మహానాయకుడు". ఇంతటి లోకప్రియ నాయకుడి చేరికతో "దేశం" ప్రభ ఖండఖండాలకు వ్యాపించడం ఖాయం.

    ReplyDelete

Post a Comment