పాదాలు కడిగిన ప్రధాని...వాటే డ్రమెటిక్ మూమెంట్


మన దేశంలో ప్రధాని స్థాయి వ్యక్తులు సామాన్యులతో మాట్లాడితేనే అదో న్యూస్..అలాంటిది సాక్షాత్తూ ఆ చేతులతో సామాన్యుల పాదాలు కడిగితే..అదో భాగ్యంగా భావిస్తూ..నమస్కారాలు చేసి..తర్వాత శాలువాలు కూడా కప్పితే..ఇక అంతకు మించిన వార్త ఏముంది..ఇదే చేసారు మోడీ..ఉత్తరప్రదేశ్ టూర్ లో బిజిబిజీగా గడిపిన మోడీ
కాసేపు సేదతీరడానికి త్రివేణీసంగమానికి వెళ్లి పితృదేవతలకు తర్పణం వదిలారు. ఆనక గంగా హారతీ ఇచ్చారు.
తర్వాత పండితులను సత్కరించారు

ఆ తర్వాతే అసలు సీన్ ఆవిష్కృతమైంది..స్వఛ్చతాహీ సేవ పేరుతో నాలుగున్నరేళ్లుగా మోత పుట్టించిన మోడీసాబ్ కి అసలు ఆ సఫాయ్ వాలాని సత్కరించాలని అన్పించిందో..లేక ప్లాన్డ్ గానే చేశారో..కానీ ఓ ఐదుగురు మున్సిపాలిటీ(శానిటేషన్) సిబ్బందిని పిలిచి కూర్చొబెట్టుకని తాను వాళ్ల కాళ్ల దగ్గర కూర్చుని మరీ పళ్లెంలో వాళ్ల కాళ్లను ఉంచి నీళ్లతో కడిగారు. ఆ తర్వాత పాదాలను తుండుగుడ్డతో తుడిచారు..ఇలా ఐదుగురు పనోళ్లకి చేయడంతో వారంతా మనసులో జంకుతో కుంచించుకుపోవడం విజువల్స్ చూస్తుంటే అర్ధమవుతుంది..ఎందుకంటే వాళ్లు ముందు ఉన్నది సామాన్యుడు కాదు..చరిత్ర తిరగరాసిన మోడీ.

మళ్లీ అదే చరిత్ర సృష్టించడానికో మరెందుకో కానీ..మోడీ చేసిన పని ఇప్పుడు చర్చకి దారి తీస్తోంది..సమాజంలోని వీధులను శుభ్రంచేసేవారికి సత్కారాలు చేయవచ్చు కానీ..ఇలా పాదాలు కడగడమనేది మాత్రం చూసుండం..అఁదుకే ఇది  సీన్ ఆప్ ది డేగానే కాదు..మోడీ లైప్ మొత్తంలో ఇదో అతి పెద్ద డ్రమేటిక్ సీన్..

పాదాలు కడగడం కాదు..కానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అమృతసర్ దేవాలయంలో చెప్పులు శుభ్రం చేయడం..పాత్రలు తోమడం వంటివి చేసినట్లు గుర్తు..కాకపోతే పాపం ఆయనకి ఏ గుర్తింపు లేదు..దానికోసం ఆయన తపించలేదు కూడా..!

Comments

  1. రాత్రి ఈ వీడియో అన్ని న్యూస్ చానెల్స్ లోనూ ప్రసారం చేసారు.

    ఎన్నికలు మొదలవుతున్నాయి కదా ఇటువంటివి బోలెడు యేసాలు వేస్తారు సార్ ...

    స్వచ్చ భారత్ ప్రకటించి 5 సం లు అయింది. రోడ్లు ఊడ్చే వాళ్ళను కాళ్ళు కడగడం కాదు స్వచ్చ భారత్ కోసం ఆయనేం ఛేసారు. శుభ్రంగా ఉన్న రోడ్డుని ఊడుస్తున్న వీడియో ఒకటి చేసారు. స్వచ్చ భారత్ కోసం కొంతమంది సెలబ్రిటీ లను ట్యాగ్ చేసారు వాళ్ళేం చేసారో కనీసం కనుక్కున్నారా ?

    ఓరి నీ యాసాలో ...

    ReplyDelete
  2. IVANNEE AAYANAKU SAHAJAMGAA ABBINA SAMSKAARAALU
    avi lenivaallaku vimtagaa anipimchavachchu .

    ReplyDelete
  3. పచ్చబడ్డ కళ్ళకి వాస్తవాలు కనపడవు . వక్రికరించాలి అనుకొంటే దేన్నైనా వాక్రికరించవచ్చు .మన్మోహన్ గారికి రావల్సినంత పేరు వచ్చినా ,మాట మారుస్తూ ప్రకటన లను (తెలంగాణా ఇచ్చి , మరల మర్చిడం ) తో వారికున్న పేరు పోయింది. స్థిరమైన నిర్ణయం లేనాప్పుడు దండుగే కదా .దమ్మున్న వాడు కావలి మనకు.

    ReplyDelete

Post a Comment