కంగన కొట్టిన దెబ్బకి క్రిష్ కి చుక్కలే కన్పించాలి మరి


టైమ్ చూసి కొట్టిందిగా..మణికర్ణిక..ఈ శాతకర్ణి సృష్టి కర్తని..ఇదే డైలాగ్ ఇప్పుడు నెట్‌లో చక్కర్లు కొడుతోంది..అదను చూసి దెబ్బ..పదును చూసి వ్యవసాయం చేయాలంటారు( ?) అందుకే మణికర్ణిక సినిమాకే నేనే దర్శకత్వం వహించినా..పేరు మాత్రం వాళ్లేసుకోవడానికి ఎలా నిద్రపడుతుందంటూ సెటైర్లు వేసిన క్రిష్‌కి దిమ్మ తిరిగే సమాధానం..పైగా ఇది ఓ రకంగా బాలయ్యబాబు ఫ్యాన్స్ కి వళ్లు మంట కలిగించేలా చేయడం ఇంకాస్త రంజుగా మారింది..ఎందుకో చివర్లో చెప్పుకుందాం

అసలు మణికర్ణిక విషయానికి వస్తే..ఈ సినిమా ఆరంభం నుంచి భలేగా హడావుడి చేసారు..దీని తర్వాత ఇక సిినిమాలు చేయనని..కంగన చెప్పడం..దానికి విజయేంద్రప్రసాద్, క్రిష్ లు వంతపాడుతూ.".మేడమ్ భలే మేడమ్ మీరు..అబ్బా మేడమ్ ఏం చేశారు.".లాంటి భజన చేస్తూ తరించిపోయారు..అసలు శాతకర్ణి సినిమా చూసినవాళ్లకి క్రిష్ కి మణికర్ణిక లాంటి సినిమాలు ఇవ్వాలనిపించడం ఆశ్చర్యమేనంటారు..ఐనా దొరికింది..కానీ ఇంతలోనే..ఎన్టీఆర్ చేయాలంటూ పిలుపు వస్తే..అది వదులుకుని రావడం దుర్మార్గమైన విషయం..ప్రొడ్యూసర్ కమ్ డైరక్టర్ గా ఓ లేడీ ఉంటే నేను ఉండనని..సోదీసూద్ పారిపోవడం అంతకంటే నీచం..ఏదైతేనేం చివరికి రియల్ క్వీన్ లాగానే..కంగననే గెలిచిింది..అలాంటప్పుడు ఆమె పేరు వేయక..క్రిష్ పేరు ఎలా వేస్తారు..80శాతం పూర్తి చేశా...90శాతం పూర్తి చేశా కాదు..అదే విషయం నిజమైతే..ప్రొడ్యూసర్లు ఎటూ క్రిష్ వెంటే పడాలి..కానీ అలా పడలేదు..ఇంకోలా పడ్డారు..
కథానాయకుడు బోల్తా కొట్టాడు..మా అడ్వాన్సులు మాకివ్వమంటూ వెంటపడ్డారు..

దీంతో మహానాయకుడిని ఓ రకంగా అంటగట్టినట్లే విడుదల చేశారు..దీని ఫలితం మరీ ఘోహం..జీవితంలో ఎరుగని అవమానం ఎన్టీఆర్‌కి  ఈ భయోపిక్ తో మూటగట్టారంటే ఆశ్చర్యం లేదు..బతికినంతకాలం ఇక ఈ ఫ్లాప్ భారం మోయాల్సిందే..ఎందుకంటే మామూలు సినిమాలు ఓకే కానీ..ఇలా తండ్రి పాత్రలో కొడుకు చేయడం ప్రపంచంలోనే తొలిసారి అని ఊదరగొట్టినందుకు ఫలితం మాత్రం బెడిసికొట్టింది..ఇదిగో ఇలాంటి టైమ్‌లో కంగనా రనౌత్ ఓ ట్వీట్ చేసింది..బాబూ క్రిష్ నువ్వంత పోటుగాడివే అయితే..మహానాయకుడి పరిస్తితి ఏంటమ్మా అనే అర్ధంలో కామెంట్ చేసింది..దీంతో అటు క్రిష్ బాధ గోరు చుట్టు పుండుపై...రోకలి పోటు పడ్డట్లైంది..ఇక బాలయ్య ఫ్యాన్స్.కి మాత్రం అదే పుండుపై కారం పూసినట్లుగా మారింది.ఎందుకంటే ఈ సిినిమా ఫ్లాప్ అని ఏకంగా బాలీవుడ్ లో కూడా ఓపెన్ గా చెప్పేసింది కదా కంగనా..
కొసమెరుపుగా ఇంకో మాట చెప్పుకుని ఆపేద్దాం..కంగనా ఇంకో సినిమా చేస్తోంది దాని పేరు క్యా పాగల్ కియా..దీని డైరక్టర్ మన తెలుగోడే..కోవెలమూడి ప్రకాష్ రావ్..అదేనండీ రాఘవేంద్రరావ్ కొడుకు..(హీరోగా కూడా ట్రై చేసి బొక్క బోర్లాపడి..వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు) ఆ రాఘవేంద్రరావ్..ఈ క్రిష్ చాలా దగ్గర..చుట్టాలు కూడా అంటారు మరి..ఇప్పుడు రాఘవేంద్రరావ్ కొడుకుతో మరి కంగనా రనౌత్ ఎలాంటి జర్నీ చేస్తుందో..చూడాలి

Comments