ఒక్క తీర్పు..బాలయ్య, పవన్ కల్యాణ్‌కి భలే రిలీఫ్ ఇచ్చేసిందిగా


సుప్రీంకోర్టు కనుక ఆ బిజెపి లీడర్..కమ్ లాయరు వేసిన పిటీషన్ తీసుకుని..ఆమె వాదనతో కనుక నిజమే అని తీర్పే ఇచ్చిందనుకోండి..పాపం పవన్ కల్యాణ్, బాలయ్య అంటూ ఉండేవారు  ఈ పాటికి.ఐతే రంజన్ గగోయ్ మాత్రం మీ పిటీషన్ లో పిటీ  ఏమీ లేదు..కాబట్టి ఇక దయచేయండి అనడంతో  ఈ ఇద్దరు హీరోలు రిలీఫ్ గా ఫీలై ఉంటారు..ఆ మాటికి వస్తే వాళ్లే కాదు..చాలామంది గతుక్కుమనేవారు.

ఇంతకీ ఆ తీర్పు ఏంటంటారా?

సంతానం ఇద్దరు కంటే ఎక్కువ కనుక ఉంటే ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హులను చేయమంటూ సుప్రీంకోర్టుకు ఓ లాయర్ పిటీషన్ వేయగా..కోర్టు వారు  అలా స్పందించారు. ఎందుకు దయ చూపాలి..ముందు మీరు మాపై దయచూపండి..ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ కంటే..పోటీ చేయకూడదనే నిబంధన విధించడంలో అర్దం ఏమైనా ఉందా..ఇది మా పరిధిలో అంశం కాదు..ఇక దయచేయండి అన్నారు జడ్జి గారు..

లేకపోతే..అటు ఇంతవరకూ పోటీ చేయకుండానే..మొత్తం దున్నేస్తానంటూ మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ డిస్ ఎలిజిబుల్ అయ్యేవాడు..పాపం ఒక్కగానొక్క కొడుకు ఇద్దరు పిల్లలున్న బాలయ్య మళ్లీ పోటీ చేయలేకపోయేవాడు..ఐతే మరి సుప్రీంకోర్టు ఇదే  రూలింగ్ గ్రామపంచాయితీలకు మాత్రం ఎందుకు వర్తింపజేయదో అర్ధం కాదు..చూద్దాం ఇలా డిస్ క్వాలిఫై అయినవారికి వళ్లు మండి కోర్టుకెళ్తేకానీ ఆ నిబంధన రద్దు కాదేమో

Comments