నీతులు చెప్పేందుకేనా..మనకి వర్తించవా..ఈనాడేమైందో మరి.!

మనం ఏమైనా చెప్పొచ్చు..అవి మనకి మాత్రం వర్తించవ్..ఇదే పెద్దల నడవడి..ఒరవడి..జీవనవిధానం..వాహినీ వారి పెద్దమనుషులు సినిమా కూడా ఇదే కాన్సెప్ట్..ఆ తర్వాత వచ్చిన పరమానందయ్యశిష్యుల కథలోనూ గణపతి అనే శిష్య పరమాణువు ఇదే విషయాన్ని వ్యంగ్యంగా చెప్పుకొస్తాడు..పెళ్లిళ్ల ఖర్చులపై సదరు మేధావి అంతర్మథనం చూస్తే ఇవే గుర్తుకురాకమానవు..

పై ఫోటో చూడండి..ఏదో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులులా లేరూ..కానీ అది ఏంటో తెలుసా
పైన ప్రచురించబడినటువంటి పేపర్ తాలుకూ పెద్దాయన మనవరాలి పెళ్లి సెట్టింగ్..అంటే ఇంత నిరాడంబరంగా ఎందుకు ఇంకా భారీగా ఉంటుంది కదా అనొచ్చు ..అవును భారీగానే తరలివచ్చారు..ఎప్పుడూ కలవని మనుషులు కూడా వచ్చి తరించిపోయారు ఆ పెళ్లిలో..ఆ కలయికలకు అప్పట్లో రాజకీయ నేపద్యాలనీ అంటగట్టారు కూడా..
 సాక్షాత్తూ ముఖ్యమంత్రులూ..సిినిమా నటులూ వచ్చిన ఆ పెళ్లి ఇంకా చాలామందికి గుర్తుండే ఉంటుంది.
అదొక్కటే కాదు..వారి ఇంట్లో ఇలాంటి శుభకార్యాలు చాలానే జరిగి ఉంటాయి..చాలానే జరుగుతాయి కూడా..అంటే ఇందులో ఆక్షేపించాల్సింది ఎక్కడ అంటే..లోకమంతా భారీగా పెళ్లిళ్లు చేసుకోవడం వలన మధ్యతరగతి..చిన్నతరగతి కుటుంబాలవారు నాశనమైపోతున్నారని సదరు రచయిత ఆవేదన చెందారు. నిజమే ఆ  లెక్కన ప్రతివారూ తమ ఇళ్లలో శుభకార్యాలకు అవుతున్న ఖర్చులకు లోలోపల బాధపడుతూనే ఉంటారు..కానీ అంతమాత్రాన తమ రాతలతో అవతలివారికి ఆ హక్కు లేనట్లు..అదేదో తమకే సొంతమైనట్లు..ఔదార్యం పలికించడమే నచ్చదు..ఇదే కాదు గతంలో తమ ఆదివారపు పత్రికలోనూ ఇలానే..కోఠి, నాంపల్లి ఏరియాల్లో సెకండ్ హ్యండ్ వస్తువులపై..వాటిని కొనేవారిపై ఎగతాళి మాటలు రాసిన చరిత్ర ఉంది..ఎవరి తాహతును బట్టి వారు తమ సౌకర్యాలను అమర్చుకోవడంలో తప్పు ఏముంది..దానికి బడాయి పోతున్నారంటూ రాయడం తగునా..సరే అది వదిలేద్దాం..ప్రస్తుత వ్యాసం విషయానికే వస్తే..సదరు పెద్దాయనతో పాటు..మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు కూడా గతంలో తమ ఇంట్లో శుభకార్యాలకు పెళ్లి కార్డులు అచ్చు వేయించేవారు కాదట..కేవలం పోస్ట్ కార్డులపైనే అడ్రసులు రాసి బంధువర్గాలకు సమాచారం ఇచ్చేవారట..వారిప్పటికీ ఆ ఆనవాయితీ పాటించి ఉంటే..పై శీర్షిక పెట్టాల్సిన అవసరమే లేదు.
అంటే స్థోమత ఉంది కాబట్టి..మేం పెడతాం..మాతో మీకేంటి పోటీ అనేట్లు అహంకారపు ప్రతులు పంచకూడదు కదా..నిజంగా శుభకార్యాలకు ఆడంబరాలకు పోవాలని ఎవరికీ ఉండదు..ఆ తెలివిడే ఉంటే..బ్రాండెడ్ షర్ట్స్, బ్రాండెడ్ ఫర్నిచర్..ఇలాంటి పదాలు ఎక్కడ విన్పించేవి..ఇంత ప్రాచుర్యం పొందేవి..బతికేదే సగం  ఫాల్స్ ప్రిస్టేజీతో..లేనోడు ఎటూ ఏదేసుకుని వచ్చినా పట్టించుకోరు..కలిగినోడు ఏదేసుకున్నా ఫ్యాషన్..మధ్యలో నలిగేది మధ్యతరగతే కదా..పై రెండు వర్గాల తెగింపు మధ్యకీ వస్తే..ఎలా..? మధ్యతరగతి వర్గం లేకపోతే పై రెండు వర్గాలకు గుర్తింపు ఉండాలిగా..

ఇంకో చిన్న ముక్తాయింపు...తెలుగు నశిస్తుందని..తెలుగుని వెలిగిస్తామనే మేధావులు..ఇలా తాము మాత్రం ఇంగ్లీష్ మీడియంలో దేశాన్ని ఉధ్దరిస్తారు..తప్పు కాదు..అదీ వ్యాపారమే..విలువలతో నడుపుకుంటామని చెప్పుకోండి ఇంకా తప్పులేదు..కానీ మిగిలినవాటిపై పడి ఏడవడం ఎందుకు..
అప్పుడే అడ్మిషన్లట...ఎప్పుడైనా ఇలాంటి ప్రీ అడ్మిషన్ల పై సదరు పత్రికలో వ్యతిరేక వార్తలు చూసినప్పుడు ఇది కూడా గుర్తుకుతెచ్చుకోండి








Comments