పచ్చచొక్కాల నిరసన..ఇది బాబుగారి మార్క్ ప్రొటెస్ట్


ప్రధానమంత్రి మోడీ గుంటూరు వస్తున్నాడు..అది కూడా బహుశా చివరిసారే కావచ్చు..అప్పుడెప్పుడో పునాదిరాయికి పవిత్రమైన(టిడిపివాళ్లే మోసారు మరి) మట్టి..శుద్ద గంగాజలం తీసుకొచ్చాడు..అంతా పరవశించిపోయారు..ఆహో..ఇదిరా మన జన్మ ధన్యం అయిందనుకున్నారు..అదే ఆనందంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని ఆశిస్తున్నా అంటూ ప్రసంగించేశారు..ఆ తర్వాత నే స్పెషల్ స్టేటస్ అనబోయి..ప్యాకేజీ అన్నా అంటూ క్యాబేజీ..క్యాలీఫ్లవర్ పెట్టారు..మోడీ గారూ అదే పూలతో పాటు..రఫెల్షియా పూలు కోసుకొచ్చి మరీ నాలుగేళ్లూ. పెట్టేశారు.. పూలు సరిపోవు గురూ సన్మానాలు కూడా చేద్దాం...అనగానే..చేద్దామంటే చేద్దాం అంటూ..
ఊరేగారు..బిజెపివాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ పొర్లుదండాలు ఒక్కటే తక్కువ...అసలు మిగిలిన స్టేట్స్ ని పక్కనబెట్టి ఏపికి ఇంత పెద్ద లాభం ఎలా చేయగలిగారు.. ఆ ప్లానేదో మాకూ కాస్త చెప్పండని..( కాంగ్రెస్ మధ్యవర్తులు) మోడీని..జైట్లీని అడిగేశారట..చంద్రబాబు గారూ అదే బాటలో ఛత్..ఎవడైనా ఓ మాట మాట్లాడితే బొక్కలో పెడతా..
ఎవడికి కావాలి హోదా..ఏమొస్తది హోదాతో..డొక్కలో తన్ని డిక్కీలో తొంగోబెట్టండి ఒక్కోళ్లని తర్వాత నే చూసుకుంటా అంటూ తెగ ఆవేశపడిపోయారు..

మధ్యలో ఎర్రిపప్పల్లా..వైఎస్ జగన్..ఆంధ్రా  మేధావుల సంఘం..భజన హామీల సాధన సమితి..ప్రత్యేకాంధ్ర ఆచరణ..ఇంకా..ఏవేవో సంగాలు ఉన్నాయ్..వాళ్లంతా కూడా ఛ..మనం మన బతుకులు ఎందుకురా మనకీ రాజకీయాలు..చూడండి..ఆ విజన్ చూడండి..ఆ నిధులు..ఆ డెవలప్మెంటూ..ఎవుడికీ రా చేతనయ్యేది అనుకుంటా సల్లబడిపోయారు..
ఇదీ జరిగిన సీన్...
మరిప్పుడో..నీ....బొక్కలిరుగుతయ్..ఎవడ్రా హోదా ఇవ్వనిది..హోదా మా హక్కు..జగన్ ది దొంగనాటకం..అతగాడో దున్న..కుమ్మక్కు రాజకీయాలు చేసేవారికి జనం బుద్ది చెప్తారు..( వీలైతే మళ్లీ బిజెపితో కలుస్తా రాష్ట్రం కోసం), కాంగ్రెస్ హోదా ఇస్తుంది( అప్పట్లో నే దరిద్రపు పార్టీ అన్నా..పట్టించుకోకండి) కేంద్రం మెడలు వంచి సాధిస్తా..( అసలు అదేందో నాకూ తెలీదు) మోడీ ఎందుకు వస్తున్నాడు..రేపంతా పచ్చచొక్కాలతో నిరసన తెలపాలి..( నల్లచొక్కా నాకు సూటవలేదు..అసెంబ్లీలో వందలాది ఎమ్మెల్యేలు నల్లచొక్కాతో రావడం రికార్డు అన్నా కానీ మర్చిపోండి  మీరు..పైగా జగన్ ని కాపీ కొట్టానంటూ ఫోటోలు కట్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. వద్దు వద్దు..మన పార్టీ కలరే కన్పించాలి) అంటూ అధినేత గారు పిలుపు ఇచ్చారు..సో రేపు నిరసన తెలుపుతారట..

మోడీకేనా చేతగానిది..ఇప్పటికే సందర్భం వచ్చినా రాకపోయినా..ఎన్టీఆర్ని పడేశారు..దెబ్బ తీశారు అంటూ డైలాగులేస్తున్నాడు కదా..ఇక రేపెలా చెలరేగుతాడో చూద్దాం..ఎన్నెన్ని భూభాగోతాలు బైటపెడతాడో...

Comments