టిడిపి మద్దతుతోనే సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ అయ్యాయ్..ఇదేగా మీ భావం


అందరికంటే ముందే ఈయన ఖండించారట. ప్రపంచంలో ఏది జరిగినా తన స్పందన తప్పనిసరి అనుకుంటాడాయన. తప్పేం లేదు కానీ..తన స్పందనవల్లనే అలా జరిగిందనే సంకేతాలు బలంగా జనాల్లోకి వెళ్లాలనుకోవడమే తప్పు..సక్సెస్ లో ఉన్నంత కాలం మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది..(ఇప్పుడు కేసీఆర్‌కి చెల్లినట్లు) అదే ఒక్క పరాజయం ఎదురుకానీయండి..అప్పుడు వరసగా మన లొసుగులన్నీ ఎలా బైటికి వస్తాయో తెలుస్తుంది


అసలు పుల్వామా ఎన్ కౌంటర్ ని నువ్ ఖండిస్తే ఏంటి ఖండించకపోతే ఏంటి..ప్రతి పనిలో మంచి కోరుకునేవారిలా కన్పించడమే ముఖ్యమా..దీన్నే కీర్తి కండూతి అంటారు..ఇదే ప్రపంచంలో అతి పెద్ద రోగం  అంటుంటారు. దేశంలో ప్రతి పార్టీ దాడిని ఖండించక...సమర్ధించిందా..లేదు కదా..పోనీ అలానే అనుకుందాం..నువ్వేదైనా పరిష్కారమార్గం చెప్పు మరి..రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ వి కదా..ప్రతి అంశాన్ని ఈజీగా పరిష్కరిస్తాను..మోడీ కంటే సీనియర్ ని అని చెప్పడం కాదు.నిజంగా చిత్తశుధ్ది ఉంటే..నీకు తెలిసిన పరిష్కార మార్గం చెప్పండి..ఢిల్లీలో చక్రం తిప్పే మొనగాళ్లకి మర ిదేశసమస్యలపై కూడా ఓ పంథా అంటూ ఉండాలిగా..ఇది చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరికీ వర్తిస్తుంది

దాడి కి ప్రతిదాడి కూడా అయిపోయింది..ఇప్పుడిక ఢిల్లీలో కూర్చుని ఇదిగో మా సపోర్ట్ వల్లనే సర్జికల్ స్ట్రైక్స్ చేయగలిగారు అంటారా.పొరబాటున ఆ మాట అంటే..ఏ పాగలైరా బయ్ అని కేసీఆర్ అన్న మాటలను నమ్మాల్సి వస్తుంది..ప్రతి ఇష్యూలో పొలిటికల్ మైలేజీ కోసం ఎందుకు తాపత్రయం











Comments