ఆంధ్రా చేగు..వేరా బాధ ఏంటో

పై వ్యాసములో ఆంధ్రజ్యోతి కథనం ఆశించిన ప్రయోజనం బహుశా నెరవేరినట్లు లేదు..ఎందుకంటే సదరు సంస్థలో ఎలాంటి కదలికా లేదు..బహుశా ఈ పత్రిక రాతలతో సదరు నిర్వాహకులు భయపడిపోయి..ఫోన్లు గట్రా చేసేసి..ఎంతో కొంత ముట్టజెప్తాం..మాపై ఇక ఏం రాయకండ ిఅంటారని ఎదురు చూశాడేమో..అబ్బే అలాంటిదేం జరగదు..ఎందుకంటే..గతంలో కంటే ఉద్యోగులు అక్కడ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు..ఎలాగంటారా..
ఏ సంస్థలోనైనా ఉద్యోగులంటే...పని చేసేవాళ్లు..పనికి ప్రతిఫలం ఆశించేవాళ్లు..ఆ ప్రకారంగా ప్రతి నెలా 1వ తేదీన డబ్బు ముట్టినప్పుడు (ఎలాంటి శషబిషలు లేకుండా) పనిలోని తప్పులు..అసంతృప్తులు పక్కకి వెళ్తాయి..అసలు అలా జీతాలు అందినప్పుడే కదా ఉద్యోగం చేస్తున్నట్లు.. మరి పైన ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నప్పుడు వేరా ఆవేదనకి అర్ధం లేదు కదా
రెండు సంస్థలో వాటాదారుల సంక్షేమం..సేకరించినవి ఎంతో పార్టీ వారు ప్రకటించాలి..కానీ పార్టీ తరపునే జ్యోతివారికి సమాచారం అందిందో..లేక వారే ఊహించి రాసారో..వారో రొక్కం ప్రకటించారు..70కోట్ల రూపాయలనో..ఇంకెంతో..
ఓ ఛానల్ నడుపుతున్నప్పుడు వాటికి ఎంత ఖర్చు అవుతుందో..సదరు సంపాదకులకు..సంచాలకులకు..ప్రమోటర్లకు తెలిసి ఉండాలి..ఉద్యోగుల జీతాలు..కరెంట్, ఏసీ ఖర్చులు..వీటికి తోడు శాటిలైట్ నిర్వహణ ఖర్చు..మన గొట్టం అన్ని ప్రాంతాల జనాభాకి కన్పించేట్లు చూసే ఎంఎస్ఓలకు ఇవ్వాల్సిన ఫీజు..ఇంతా కలిపి కనీసం ఓ కోటి రూపాయలు నెలకు అవడం ఖ ాయం..అంటే ప్రతి నెలా ఈ మేరకు నిల్వ ఉంచిన మొత్తం లో కోత పడుతుంది కదా..మరి ఆదాయం మాటేంటి అంటారా..అది అక్కౌంట్లు నిర్వహించేవారు చెప్తారు..అది కూడా  ఆంధ్రజ్యోతి వారు రాయాల్సింది..అప్పుడు ఆదాయం ఎంతో..కోత ఎంతో మిగులు ఎంతో తెలుస్తుంది..

ఓ వేళ ఛానల్ నిర్వహణ లాభసాటిగా ఉంటే..ఎవరూ అమ్మేవారే కాదు..సరే అమ్మారు..ఎంతకి అమ్మారు..అమ్మినదాంట్లో..ఎంత వాటాదారులకు ఇవ్వాలి అనేది..విక్రేతల పని..కొనుగోలుదారులది కాదు..ఎందుకంటే..వాటాదారులకి లాభనష్టాలతో కొత్త యజమానికి పని ఉండటానికి ఇదేం లిస్టెడ్ కంపెనీ కాదు..ఓ రకంగా ఛానల్ అంటే..లైసెన్స్ మాత్రమే కొత్త యజమాని కొన్నట్లు అనుకోవాలి..ఎందుకంటే కొత్త ఎక్విప్ మెంట్..ఉద్యోగుల జీతాలు కొత్త యజమానే ఇస్తున్నప్పుడు అనవసరంగా కోట్లిచ్చి కొనడమంటే..అది కేవలం లైసెన్స్ కి మాత్రమే..ఇక వాటాదారులకు లాభం కూడా ఇవ్వాలి అంటే..వ్యాపారం ప్రారంభమైన తర్వాతే లాభనష్టాల సంగతి చూడాలి..ఇది కొత్త యజమాని పరిధిలోని ఇప్పుడే  ప్రారంభమైనది..పాత యజమాని ఎఁదుకు లాభాలివ్వలేదో..ఈ ఏడేళ్లు ఆంధ్రజ్యోతికి ఎఁదుకు గుర్తుకురాలేదు..మీ బాబుకి లెఫ్ట్ అండ్ రైట్ పని చేయనప్పుడే ఇలాంటివి గుర్తొస్తాయా..మీ రాతల్లో వాస్తవికత..అలానే జన ప్రయోజనం ముడిపడి ఉంటే విక్రేతలనుంచి వాటాదారులకు లాభం అందే వరకూ అంటే  కనీసం ఓ వారం రోజులు దీనిపై ఫాలో అప్ న్యూస్ రాయండి అప్పుడు అందరికీ ఆమోద..యోగ్యమవుతుంది..అన్నట్లు గురూజీ ఆంధ్రజ్యోతి మీ పరం అయినప్పుడు కూడా అందరికీ న్యాయమే చేశారా..? 

Comments