వహ్వారే బాబూ..ఎన్నికలు సంవత్సరానికి ఒకసారి వస్తే ఎంత బావుండు


ఇదేదో ఎలక్షన్స్ రాగానే మన ముందు వాలిపోయే లీడర్ల గురించో..వారి ఫేస్ చూసి తరిద్దామనో..లేక వాళ్లిచ్చే చిల్లర ఎంజాయ్ చేయవచ్చనో కాదు..ప్రతి ఏటా ఎన్నికలు వస్తే..తీరని హామీ అంటూ ఉండదు కదా..తాజా పంచ్ చూస్తే..అదే అన్పిస్తుంది..ఎన్నికలకు ఆరు నెలల ముందు నిరుద్యోగ భృతి..తర్వాత మూడు నెలల ముందు డ్వాక్రా గ్రూపు మెంబర్లకి పదివేల రూపాయలు..పూర్తిగా పంట రైతుల అప్పులు రద్దు చేయడం..ఇలా వరసగా చేసుకుంటూ పోతోన్న చంద్రంగారు..అసెంబ్లీలో ఓ గోప్ప..వరాన్ని ప్రకటించేసారు..ఆ చారిత్రక..చరిత్రాత్మక నిర్ణయం ఏంటంటే..
దళిత క్రిస్టియన్లను ఎస్సీలలో చేర్చడం..అంటే అదేదో  మన చేతిలో పని కాదు..కదా..కేంద్రం చేతిలో పని..

అందుకే గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారి మాటల్లోనే ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉన్న  ఈ సమస్యని ఇకనైనా
తీర్చేసి అర్జంట్ గా వారందరి అభిమానానికి పాత్రులవుదాం..పునీతులవుదాం అనే గ్రహింపు వచ్చింది. అది కూడా  ఎన్నికలకు మూడు నెలల సుదీర్ఘ సమయం ఉండగానే...తీర్మానం చేసి పారేసారు. ఫోండి నా అంత నిబద్దత కలిగిన లీడర్..పార్టీ ఏదైనా ఉఁదా. అంటూ ప్రశ్నించుకుంటూ..

కేంద్రం దాన్ని ఆమోదించేవరకూ అండగా ఉంటామంటూ చంద్రబాబుగారు చెప్పారు కాబట్టి..ఆ పని అయి తీరుతుంది. ఎందుకంటే గతంలోనూ ఇలానే ఆయన అనేక కార్యాలు కేంద్రం మెడలు వంచి చేయించారు. కాపులకు రిజర్వేషన్లు..ఇప్పుడీ ఎస్సీలలో చేర్చుట..ఇంకా వెనక్కి పోతే, ప్రత్తేక ప్యాకేజీ అనబడు ప్రత్యేక హోదా..ఇవన్నీ కూడా బాబుగారి చలవే.. ఇకపోతే ఇవన్నీ కేంద్రం దగ్గరకి నెట్టేస్తే..క్రెడిట్ మీకెలా వస్తుందనడగవద్దు. ఎందుకంటే..అది చేసేది లేదు చచ్చేది లేదు..నా పని నేను చేశానని చెప్పుకుని తిరగవచ్చుకదా..సరే ఇవన్నీ కేంద్రం పరిధిలోనివే బాబయ్యా..


.మీరు మున్సిపల్ ఎన్నికలు..అంతకముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిిన హామీలు మీ పరిధే కదండయ్యా..అవి ఏం చేసారు...ఇంటింటికీ మినరల్ వాటర్ రూ.2కే..ఎన్టీఆర్ సుజల స్రవంతి.. ప్రతి ఒక్కరికీ ఇల్లు, రేషన్ సరుకుల పంపిణీ,  డిఎస్సీల నిర్వహణ, గ్రూప్ పోస్టుల నోటిఫికేషన్( నోటిపికేషన్ మాత్రమే అయ్యా..ఉద్యోగాలు మీరెటూ భర్తీ చేయలేరు) అన్న కేంటీన్..ఎప్పడు చేస్తారు సామీ ఇవి కూడా ఇవ్వకుండా జగన్ పార్టీ వాళ్లే అడ్డుపడుతున్నారా..ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలలో ఎవరికి వారు సంపాదించుకున్న ఉద్యోగాలు కూడా కలిపే లెక్క పెడతారయ్యా..అలాగున ఐతే..మీరు ఇచ్చింది నోటిఫికేషన్లతో కనీసం ఏడాదికి పదివేలైనా చేశారండయ్యా..?

 ఏ కులంలోని వారికైనా పేదలైతే చాలు పదిశాతం రిజర్వే,షన్లు ఇస్తానంటే అది ఎన్నికల కోసం అని ఓ వాస్తవం తెలిపిన మహానేతా..మరి ఇప్పుడీ చేర్పులు..మార్పులు మాత్రం సమాజం బాగుపడటానికా..బాబూ మీరు చేస్తే..
డ్యాష్..ఇతరులు చేస్తే...డ్యాషా...?

Comments