ఎలక్షన్లకి ముందు విదేశాలకు ఎవరూ వెళ్లరు..ఆహా..ఏం చెప్పారు సర్..ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్



దావోస్ టూర్‌కి వెళ్లబోతూ...ఢిల్లీలో ఏదో జరగబోతోంది.. మమతాబెనర్జీ, అర్వింద్ కేజ్రీవాల్ సహా చాలామంది వచ్చేస్తున్నారని తెలీడంతో..తాను ఆగిపోయి...చినబాబుని పంపారు చంద్రబాబు..లేకపోతే..ఆ సమయంలో ఆయన వెళ్లి ఉంటే కనీసం 50వేలకోట్ల పెట్టుబడులకు పేపర్ కటింగ్‌లు తయారైపోయేవి..ఐతేనేం..చిన్నబాబు గారు తక్కువా..ఐదువేల కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ మెంట్, అటు మోడీ అమిత్ షా విపరీతంగా అడ్డుపెట్టినా..గుజరాత్ కి లాక్కుపోవాలనుకున్నా విజయవంతంగా ఓడించేసి..ఏపీకి తీసుకొచ్చేశాడు..బహుశా అది జరిగింది ఇండియాలోనే అనుకుంటా..


ప్రతి ఎన్నికలకు ముందు..చెప్పా పెట్టకుండా..సడన్ గా రెండు మూడు రోజులు సింగపూర్ వెళ్లొచ్చేది జగనే కాబట్టి..అది ఖచ్చితంగా సొమ్ము తె్చ్చుకోవడానికే అయి ఉంటుంది..ఎందుకంటే..డిమానిటైజేషన్  జరుగుతుందని తెలిసి తన  కంపెనీలో వాటాలు అమ్మేసుకుంది జగనే కదా..ఆ తర్వాత నల్లధనం దొరికిపోవడంతో జొరం తెచ్చుకున్నాడనే విమర్శలూ జగన్  ఎదుర్కున్నాడు కదా..పైగా ముక్కిపోయిన డబ్బంతా పనికిరాదని తెలీడంతోనే జగన్ కి జొరం వచ్చిందని..దేవినేని ఉమా( మేల్) అప్పట్లో వేసిన జోకులకు మనం భలే నవ్వుకున్నాం కదా..!


డబ్బులు కోసమే జగన్ వెళ్తున్నట్లు అనుమతి ఇచ్చినవారికి కూడా తెలుసు..అందుకే వెంటనే బాబూ వెళ్లి నీ డబ్బు నువ్ తెచ్చుకో...కానీ అక్కడే చదువుకుంటున్న నీ కూతురిని పలకరించినా...అటువైపు వెళ్లినా మాత్రం ఊరుకోం అని చెప్పి పంపించారు..ఐతే ఇదెలా లీకయిందో కానీ..చంద్రబాబుగారికి తెలిసిపోయింది..ఎంతైనా అపరచాణక్యుడు..ఢిల్లీలో చక్రం తిప్పేవీరులు కదా..వెంటనే తెలిసిపోయింది..బహుశా మోడీగారు సౌత్ కొరియా వెళ్లింది కూడా ఇందుకేనేమో అని డౌట్..అయితే అది అందుకో కాదో మనం చెప్పడానికి లేదు..ఎందుకంటే..ఏం చెప్పినా ఆయనే చెప్పాలి..ఎవరికి సపోర్ట ్ చేసినా ఆయనే చేయాలి..ఆయన నంది అంటే నంది పంది అంటే పంది..కాదు కాదు..ఆయన ప్యాకేజీ అంటే ప్యాకేజ్...లేదంటే హోదా..

Comments

  1. తెలంగాణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందట ఉత్తం కుమార్ రెడ్డి దుబాయికి వెళ్ళింది ఎందుకో మరి?

    ReplyDelete
  2. జగన్ లండన్ పర్యటన అని వ్రాసి ఉంది కదా ? ఇంతకూ వెళ్ళింది లండనా ? సింగపూరా ?

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారూ..అది ముఖ్యమంత్రిగారిపై వేసిన వ్యంగ్యం..కాకపోతే నేను మీకు అ ర్ధం అయ్యే రీతిలో రాయలేకపోయాను..
      :))

      Delete

Post a Comment