కేఏ పాల్ ఈ పాపుల్‌ని క్షమించు..దయచేసి పాలిటిక్స్ నుంచి వెళ్లిపో


గత నెల రోజులుగా అనుకుంటా..కేఏ పాల్ ని చెడుగుడు ఆడుకోని ఛానల్ లేదు..అసలు ఆయన మాటలు వింటే ఓ వైపు నవ్వొస్తుంటుంది..మరోవైపు జాలి వేస్తుంటుంది..ఏతావాతా ఓ రకంగా మానసిక స్తితి సరిగా లేని ఓ వ్యక్తిని 16 ఛానళ్లు తమ రేటింగ్స్ కోసం ఆయన్ని బలి చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే..ఓ సారి చంద్రబాబు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటాడు..తనకి పిఏగా పెట్టుకుంటానంటాడు..అంతలోనే ఏపీని సర్వనాశనం చేశాడంటాడు..మరోవైపు జగన్ ఏం చేస్తే గెలుస్తాడో చెప్తాడు..అంతలోనే పులివెందులలో జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేస్తా అంచాడు

2019లో తనతో కలిసి రావాలని పవన్ కల్యాణ్ కి పిలుపు ఇస్తాడు..ఆయనెవరో తెలీదని అంటాడు..బాలయ్య విషయంలోనూ అంతే..ఇవన్నీ పక్కనబెడితే..నిజంగా ఓ మానసిక వికలాంగుడిని చూసి ఎగతాళి చేసినా..హెరాస్ మెంట్ చేసినా...మానవహక్కుల కమిషన్ ఎంత తీవ్రంగా స్పందిస్తుంది..నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తుంది..ఇప్పుడదే పని టివి ఛానళ్లపైనా చేస్తే..ఎందుకంటే అవతలి వ్యక్తి మానసిక దౌర్బల్యాన్ని హేళన చేస్తూ
పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టడం..కమింగ్ అప్స్ ఇవ్వడం చేస్తూ..ఆయనపైనే జోకులు వేస్తూ..తమ పబ్బం గడుపుకుంటున్నందుకు అన్ని చానళ్లకి జరిమానా వి్ధిస్తే..

ఎందుకంటే 2014కి ముందు కూడా ప్రజాశాంతి పార్టీ అంటూ ఈయన ఇలానే హడావుడ ిచేశాడు.ఇప్పుడు కూడా
కుప్పంలో టిడిపి అడ్రస్ గల్లంతు చేస్తా..భూస్తాపితం చేస్తా..జగన్ ని ఓడిస్తా అంటూ మాట్లాడుతున్న ఈయనని చూస్తే జాలి వేయకమానదు.. ఆయన మాటలను పడి పడి నవ్వడమే కానీ..ఎవరైనా సీరియస్ గా తీసుకుంటున్నారా..అంటే ఓరకంగా జబర్దస్త్ కామెడీకి బదులుగా టీవి ఛానళ్లు ఆయన ఎపిసోడ్స్ ని ప్రసారం చేస్తున్నాయనే అనుకోవాలి. 

Comments