జయరాం మేనకోడలు శ్రిఖా చౌదరి గడ్డి పెట్టింది .అయినా వింటేనేగా మీడియా..దాని దారి దానిదే


నాలుగు రోజుల నుంచి ఒకటే హోరు..ఆ హోరుకి సదరు శ్రిఖా చౌదరినే కారణం చేసిన ఛానళ్లకి బుద్ది వచ్చేలా మాట్లాడిందామె..ఐనా సరే తమ నైజం వదిలేదు లేదంటూ అదే పోత..మొదట్నుంచీ ఈ ఎపిసోడ్ గమనించినవారికి చిరాకు పుట్టింది..అసలు చచ్చింది జయరాం అయితే..చంపింది ఎవరో తేల్చాలి కానీ..రాకేష్ రెడ్డి ఇంతకు ముందు ఏం చేసాడు..అసలు ఆయన పార్టీ ఏంటి..ఆయన వేసుకున్న ప్యాంట్ కలర్ ఏంటి..సోషల్ మీడియాలో ఏం చేసేవాడు..

ఎవరితో వ్యభిచారం చేయించాడు..ఎక్కడెక్కడ బ్లాక్ మెయిల్ చేశాడు అంటూ సొల్లు ఎందుకు..ఓ వేళ ఇవన్నీ ముందే తెలిసి ఉంటే..ఇలాంటి రాకేష్ రెడ్డి  జనంలో ఎందుకు తిరుగుతున్నాడు..అని పోలీసులకు కదా అప్పగించాలి..ఆ ఆ పని మాది కాదు..పోలీసులది అని చెప్పి తప్పించుకుంటే..మరి ఇన్వెస్టిగేషన్ జరిగే తీరుపై మాత్రం ఎందుకు డైరక్షన్లు ఇవ్వాలి..పైగా అక్కడికేదో వీళ్లే దగ్గరుండి ఇంటరాగేష్ అంతా విని చూసి చచ్చినట్లు..పోలీసులకు అలా చెప్పింది..ఇలా  పడుకోవడం నాకు ఇష్టమే అని చెప్పింది..నాకు రెండు పెళ్లిల్లు అయ్యాయని చెప్పింది..ఇంకా ఇలా చెప్పింది..అలా చెప్పింది అంటూ తెగ వండేసుకున్నారు..పైగా రాకేష్ రెడ్డి అనే పేరుతో ఇంకో వ్యక్తి ఫోటోని కూడా బ్రేకింగ్స్ లో పెట్టి తరించిపోయింది..తీరా అతగాడు..అసలు ఈ కేసులో రాకేష్ రెడ్డి ఒకడు కాదని తెలిసిన తర్వాత ఏమాత్రం చిన్న సారీ కూడా చెప్పకుండా..అదే పోత..ఇప్పటికీ యూట్యూబ్ వీడియోలల అతగాడి థంబ్ నైల్ ఫోటోనే పెట్టారు


ఇప్పుడు ఇదే విషయాన్ని సదరు శ్రిఖా చౌదరి చెప్తూ..అసలు నా క్యారెక్టర్..చనిపోయినతని క్యారెక్టర్ దెబ్బ తీస్తున్నారు..మీకు అసలు ఏం కావాలి అంటూ వాపోయేసరికి సదరు రిపోర్టర్ నోరెళ్లబెట్టి చూస్తూ ఉన్నాడే తప్ప మేం చేసింది తప్పే అని ఒక్క మాట అనలేకపోయాడు..ఎంక్వైరీలు వీళ్లే చేస్తారు..ఎలా చేయాలో వీళ్లే చెప్తారు..పైగా ఇదెందుకు మర్చిపోయారు..వాడెందుకు స్టేషన్ కి వచ్చాడు..ఆ టైమ్ లో ఆ కుక్క అటుగా ఎందుకు పరిగెత్తింది లాంటి చొప్పదంటు  ప్రశ్నలతో జనంలో లేని ఆసక్తి కలిగించేందుకు చావు తెలివితేటలన్నీ ప్రదర్సిస్తారు..ఐనా సరే జనం వీళ్ల హడావుడిని పట్టించుకోకుండా..ఎఁటర్ టైన్ మెంట్ చానెళ్లవైపు పరిగెత్తిన సంగతి గుర్తించరు..

ఇప్పుడు తెలంగాణలో దర్యాప్తు చేసిన తర్వాత ఈ శ్రిఖాచౌదరికి ఏమీ సంబంధం లేదని తేల్చిందే అనుకోండి..జస్ట్..ఏం జరుగుతుంది..పెంటమీద రాయిెందుకు వేయాలని..ఈమె ఊరుకోవడమే తప్ప..గొట్టాలు హడావుడి మాత్రం తగ్గదు


Comments