ఆవు పేడ..భలే గిరాకీ


రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసినవారికి ఏనుగు పేడని వేలల్లో అమ్ముతామంటూ గుండు హనుమంతరావ్..రాజేంద్రప్రసాద్ బ్రహ్మానందానికి టోపీ పెట్టిన సంగతి గుర్తుందా.. ఇప్పుడలానే ఆవు పేడకి ఆయుర్వేదంలో బోలెడంత ప్రాధాన్యత ఉందంటూ ఓ అభినవ చేగువేరా రాసిన ఓ కథనం భలే కామెడీగా ఉంది

విషయం ఏమిటంటే..చిక్ మగ్ళూర్ లోపశువైద్యశాఖలో   ఓ ఎంప్లాయీ చేసిన పని బైటపడి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చింది..ఈ శాఖలో పాడిపరిశ్రమ కూడా ఒక విభాగం కాబట్టి..అందులో భాగంగా ఎక్కడికెక్కడ  పేడా తట్టా బుట్టతో సేకరి్స్తుంటారు..అలా కలెక్ట్ చేసిన ఆవుపేడ కొన్ని టన్నులకు చేరిపోింది. ఇదివరకు అంటే గోబర్ గ్యాస్ లాగా  ప్లాంట్లు పెట్టుకునేవాళ్లు..ఇప్పుడు అవసరం ఉన్నవాడు..వైద్యంలో వాడేవాడు ఎవడో ఒకడు ఏదోటి చేస్తుంటారు..

ఐతే కొన్నాళ్లుగా బిరూర్ స్టేషన్ లోని ఈ గోడౌన్ లో గో డంగ్ సైజుల్లో తేడా కన్పించిందంట. ఏంట్రా అని చూస్తే..పేడ బస్తాలు( మన పిడకల్లా గడ్డకట్టుకుపోయి) తగ్గుతున్నాయట. దాదాపు 35 ట్రాక్టర్ల పేడ జంప్..  మొత్తం విచారించేసరికి ఓ ఉద్దోగస్తుడు వాటిని కాజేశాడట. అలా కొట్టుకుపోయిన ఆవుపేడ ఖరీదును లక్ష రూపాయలపైనే అని తేలింది. అంటే మనకి మనసుండాలే కానీ..కాజేయడానికి అమ్ముకోడానికి బోలెడన్ని దారులు..ఐతే ఈ స్టోరీకి మంచి రేటింగ్ తెప్పించేందుకు ముక్తాయింపుగా సదరు పత్రిక ఆవుపేడకి చాలా మహత్తు ఉంది..సస్యరక్షణలో ఆవుపేడ ముఖ్యమైనది..ఆయుర్వేదంలో వాడతారు..ఈ నేపధ్యంలో డిమాండ్ పెరిగింది అంటూ సంబంధం లేని అంశాలు జొప్పించడమే హైలైట్.

Comments