రాజకీయాలను వ్యాపారం చేశారట..జగన్ పై బాబు కామెంట్




జగన్ రాజకీయాలను వ్యాపారం చేశాడు
ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికి టిక్కెట్లు ఇస్తున్నారు
ఏపీలో పాదయాత్ర చేసి హైదరాబాద్‌కి వెళ్లిపోయారు
హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న కొంతమంది నేతలు కేసీఆర్‌కి భయపడుతున్నారు "
ఏపీ సిఎం చంద్రబాబునాయుడు గారి మాటలుగా ఇవాళ ఛానల్స్‌లో కన్పించినవి..చూసినవి..ఈ మాటలు ఎవరైనా అని ఉంటే..అంటే..ఏ చిరంజీవో..పవన్ కల్యాణో..కన్నా లక్ష్మీనారాయణ, లగడపాటి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇంకా..సో అండ్ సో..ఎట్సెట్రా..ఎట్సెట్రా..అని ఉంటే ఎవరైనా లక్ష్యపెట్టవచ్చు. కానీ చంద్రబాబునాయుడి గారి మాటలు మాత్రం రివర్స్ అవుతాయి.

యలమంచిలి సత్యనారాయణ, సిఎం రమేష్, నామా నాగేశ్వరరావ్,  నారాయణ,  వీళ్లంతా..చంద్రబాబు కోటరి అంటూ గత పదిహేనేళ్లుగా ప్రచారం జరుగుతుంది..మంత్రిగా ఇప్పుడున్న నారాయణ అయితే, 6ఏళ్లుగా పార్టీకి ఫండ్ ఇస్తూ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా తాను అనుకున్నది సాధించడానికి..ఎమ్మెల్సీ..ఆ తర్వాత నేరుగా మంత్రి అయిపోయారు..దీనికి కారణం..ఓపెన్ గా నే తెలుసు..ఇక సుజనాచౌదరి..సిఎఁ రమేష్ ఇద్దరూ అంతే..ఒకరు పార్టీకి ఫీడర్ అయితే మరొకరు బినామీ అని టిడిపి సర్కిల్స్‌లోనే అంటుంటారు..పార్టీకి ఇప్పుడు 2019లో కొన్ని కొత్త ముఖాలు కన్పిస్తే...దానికి కారణం కూడా డబ్బే అంటారు. ఇది ఆయన డైలాగుల్లో ఒకదానికి సమాధానం. టిడిపి టిక్కెట్ మీరు ఎవరికి ఇవ్వబోతున్నారో ముందే చెప్పగలరా..రాజకీయాల్లో అవతలి పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి 50లక్షలు ఇచ్చి పంపిన మీరు రాజకీయాలను వ్యాపారం చేశారని ఎలా ఆరోపిస్తారు.

ఇక రెండోది ఏపీలో పాదయాత్ర చేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు..అని..ఔను ఆయన అమరావతికి రాలేదు..ఇకపై రానని ఏమైనా చెప్పాడా..ఫిబ్రవరి 14కి గృహప్రవేశం ముహూర్తం వాయిదా పడిందని వార్తలు చూసుంటాం..ఈలోపునే ఇంత ఆత్రం ఎందుకు..ఓ వేళ జగన్ అమరావతిలో ఉంటే..అక్కడ వసతులపై రోజుకో వార్తలు వేసుకోవాల్సి వస్తుంది..దానికి సిధ్దమేనా మరి..హైదరాబాద్ లో ఆస్తులు ఉండటం తప్పేం కాదు

ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్‌కి భయపడతారా..
" మీరు సడన్ గా రాత్రికి రాత్రే..కరకట్టపై వచ్చి పడ్డారు.".ఈ కామెంట్ ఎప్పుడు ఎందుకు బైటికి వచ్చి మిమ్మల్ని ఇంకా ఎందుకు వెంటాడుతుంది బాబు గారూ..నిజంగా భయం  అనేది ఎవరికి లేదు..అవతలివారికి ఉన్నదే భయమా..మీకున్నది ధైర్యమా..! అదే నిజమైతే..నాలుగున్నరేళ్లుగా తెలుగు ప్రజలకు గుండుసున్నా కొడుతున్న మోడీపై ఎందుకు మాట్లాడలేదు..ఎన్నికలకు ముందు కంచు ఢక్కాలు మోగిస్తున్నారు

Comments