బొమ్మ తెచ్చిన తంటా ఈసారి మాయావతికి సుప్రీంకోర్టు షాక్..


ఎన్నికలకు ముందు విపక్షనేతలకు వరసగా సిబిఐ ద్వారా కేంద్రం షాక్ ఇస్తోంటే..ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం మాయావతికి ఈసారి సుప్రీంకోర్టునుంచి ఎదురుదెబ్బ తగిలింది. నిర్భీతిగా బహుజన్ సమాజ్ పార్టీ గుర్తైన ఏనుగు, తమ నేతల విగ్రహాలు నోయిడా అంతటా నెలకొల్పడంపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందు వాటికంతా ఎంత ఖర్చైందో..అంతా..కోర్టు దగ్గర డిపాజిట్ చేయాలని సూచించిందిఏప్రిల్ 2న తర్వాతి విచారణ జరుగుతుందని కోర్టు చెప్పింది. దీంతో రాజకీయంగా మాయావతికి ఎదురుదెబ్బ తగిలినట్లే భావించాలి. ఎందుకంటే..రేపు ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చిందంటే అటు యూపీ సర్కారు కానీ..కేంద్రం కానీ ఈ విగ్రహాలకు ముసుగులు వేయడంతో పాటు..ఏనుగు విగ్రహాలను తొలగించడం ఖాయంగా కన్పిస్తోంది.

 ఈ కేసుకి సంబంధించిన వివరాలు చూస్తే..మాయావతి ముఖ్యమంత్రిగా ఎన్నికైన 2007-2012 హయాంలో తమ పార్టీ వ్యవస్థాపకుడైన కన్షీరాం విగ్రహాలను నోయిడా..లక్నోలో నెలకొల్పారు. అలానే ఆయన విగ్రహాలతో పాటు..తన విగ్రహం,,పార్టీ గుర్తైన గజరాజుల విగ్రహాలను కూడా భారీగా ఏర్పాటు చేసారు. వీటి కోసం ఏకంగా రూ.2600కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పట్లోనే మాయావతి చర్యలపై నిరసన వ్యక్తమైంది..జనం డబ్బుతో ఇలా సొంత విగ్రహాలు పెట్టుకోవడమేంటని ఆక్షేపణలూ వచ్చాయ్. మెమోరియల్స్ పేరిట స్కామ్ జరుగుతుందంటూ అప్పట్లోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద కేసు కూడా నమోదు చేసింది.
ఆ సందర్భంగా జరిగిన ఎంక్వైరీలో మాయావతి, అప్పటి మంత్రి నసీముద్దీన్ సిద్దికి, బాబూ సింగ్ కుష్వాహా సహా 199మంది విగ్రహాలకు అవసరమైన ఇసుక కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డట్లు తేల్చారు. అప్పట్నుంచీ ఈ కేసు నలుగుతూనే ఉఁడగా..తాజాగా ఓ విజిల్ బ్లోయర్ లాయర్ ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు
దానిపై స్పందించిన జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా..సిజేఐ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీంధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీంతో యుపిలో మాయావతికి  చిక్కులు మరింత ఎక్కువైనట్లు భావించాలి

Comments