ప్చ్.. ప్రియాంక రాకతో పెద్దగా సుఖపడేదేం లేదు..మోడీ మార్క్ సర్వే


ప్రియాంక రాకతో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఎంత..అసలు ఇంతకీ లాభం ఉఁటుందా లేదా..ఇవే ప్రశ్నలతో  యాక్సిస్ మై ఇఁడియా , పిఎస్ఈ అనే సంస్థలు చేసిన సర్వేలో ఆ పార్టీకి షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయ్. గాంధీ కుటుంబ వారసురాలు రాకతోపార్టీకి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏదీ ఉండదంటూ ఆ సర్వే చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది

ప్రియాంక రావాలి..బిజెపి పీచమణచాలి అనే నినాదంతో కాంగ్రెస్ క్యాడర్ ఊగిపోతుంటే..యాక్సిస్ మై ఇండియా పొలిటికల్ స్టాక్ ఎక్సేంజ్ పేరుతో చేసిన ఓ సర్వే మాత్రం అంత సీన్ లేదంటోంది. ఈ సర్వే చేపట్టిన వారిలో 57శాతం మంది ఆమె వచ్చినందువల్ల కాంగ్రెస్‌కి పెద్దగా సుఖం ఉండదంటూ పెదవివిరిచారట. జనవరి 23న ప్రియాంక గాంధీ యూపీ ఈస్ట్ ఇన్‌ఛార్జ్‌గా నియామకం జరగగా..సర్వే ఫిబ్రవరి 6 వరకూ చేశారట. కేవలం 27శాతం మంది మాత్రమే
ప్రియాంక రాకతో కాంగ్రెస్ కి కొత్త ఉత్సాహం అందుతుందని అభిప్రాయపడ్డారని యాక్సిస్ మై ఇండియా చెప్తోంది

 ఈ సర్వేలోని మరో విచిత్రమైన అంశం ఏమిటంటే..ప్రియాంక కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే..ఏ పార్టికి నష్టం చేకూరుతుందంటే..56శాతం మంది బహుజన్ సమాజ్, సమాజ్ వాదీ పార్టీకే నష్టమని చెప్పడం. 31శాతం మంది మాత్రమే బిజెపికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ప్రియాంక గాంధీని యూపీ ఓటర్లు పెద్దగా ఆదరించరని..ఆమెకి
ఫాలోయింగ్ ఉందని..కానీ రాజకీయ అనుభవం లేని కారణంగా పట్టించుకోరని సర్వేలో వెల్లడైందంటున్నారు

 ఐతే ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ ముఖ్యమంత్రి ఎవరు కావాలని నాలుగు ఆప్షన్లు ఇవ్వగా..యోగి ఆదిత్యనాద్ వైపే 39శాతం మొగ్గుచూపారు..అఖిలేష్ యాదవ్‌ కావాలని 33శాతం, మాయావతి 14శాతం కావాలని కోరుకున్నారు. ఐతే సెప్టెంబర్ 2018లో మాత్రం యోగినే తిరిగి సిఎం కావాలనే వారి శాతం 43శాతం ఉఁడగా..ఇప్పుడు 39శాతానికి తగ్గిపోయింది. యోగి, అఖిలేష్, మాయావతి కాకుండా..ఇతరులు కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా తక్కువేం కాదు..11శాతంమంది కొత్త నేతలు కావాలని  యాక్సిస్ మై ఇండియా సర్వేలో అభిప్రాయపడ్డారు
ఐతే ఈ సర్వే చేసిన ఇండియాటుడేకి ఎక్కువగా మోడీకి అనుకూలంగా రాతలు కోతలు ఉంటాయని అంటుంటారు మరి

Comments