ఒకప్పుడు టాప్ డైరక్టర్..సోదిలో కూడా లేడిప్పుడు..మరీ ఎనర్జిటిక్ హీరోతో వర్కౌటౌవుతుందా


ఒక్క హిట్టు చాలు..ఇండస్ట్రీ మొత్తం వెంటపడుతుంది..అదే ఒక్క ప్లాపు చాలు..చీదరించుకుంటుంది..అసలు ఎవడ్రా నువ్ అనేట్లుగా కూడా చేస్తుంది..పేరు మోసిన దర్శకులకైనా..హీరోలైనా...ఎవరైనా..సరే మహా అయితే రెండు మూడు ప్లాపుల వరకూ తట్టుకోగలరేమో కానీ..పరాజయం మాత్రం ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది..అర్ధమయ్యేలా చేస్తుంది
చిత్రమేమిటంటే..చిత్రరంగంలో ఇలాంటి స్తితి ఎదుర్కొన్నవాళ్లు కూడా తర్వాత ఇతరులతో అదేలా ప్రవర్తించడమే దారుణం.
ఇప్పుడు మనం చెప్పుకునే వివి వినాయక్ పరిస్థితి చూస్తే మరీ జాలేయకతప్పదు..హిట్లు కొడుతూనే తెర వెనక్కి జరిపేశారితన్ని..ప్రేక్షకులైతే అసలు పట్టించుకోవడం కూడా మానేసారు..ఎంతగా అంటే ఖైదీ నంబర్ 150 అనే ిచిరంజీవి చివరి( అంటే ఇప్పటిదాకా విడుదలైన వాటిలో అని) సినిమాకి కూడా ఈయనే డైరక్టర్ అంటే వెంటనే స్ట్రైక్ అవదు కూడా..ఇలా వరస ఫ్లాపులు కారణంతోనే వివినాయక్ గురించి మర్చిపోయారునుకుంటే పొరబాటు..

వరసగా చెత్త సిినిమాలు..అంటే  ఇంకా ఎప్పటివో ధోరణులతో సినిమాలు చుట్టేస్తే మెచ్చడం  లేదు..ఓ మూసలో అదే కుటుంబంలోని అందరి హీరోలపై ట్రై చేస్తానంటే వాళ్ల కుటుంబకథానాయకులు ఒప్పుకోవచ్చేమో కానీ..ప్రేక్షకులు కాదు..అందుకే తిప్పి కొట్టేశారు..ఓ రేలంగి నరసింహారావ్, ఓ ముత్యాల సుబ్బయ్య, ఓ బి.గోపాల్..ఇంకా వెనక్కి వెళ్తే ఏ. కోదండరామిరెడ్డి..కే.రాఘవేంద్రరావ్ లాగా..మేమూ గతంలో హిట్ సినిమాలు తీశాం సుమా అని చెప్పుకోవడమే మిగులుతుంది..ఇప్పటికే వివి వినాయక్ అనే వ్యక్తి డైరక్షన్ లో చేయాలనే ఇఛ్చ ఏ హీరోలోనూ కన్పించడం లేదు..

 ఇలాంటి తరుణంలో రవితేజ వినాయక్ తో సినిమా చేయడానికి ఒప్పేసుకున్నట్లు టాక్..ఫైనలైజే చేసేసి సినిమా అనౌన్స్ చేస్తానని నిర్మాత చిల్లర కల్యాణ్ కూడా చెప్పేశాడుట..ఐతే అప్పుడే  ఇదేదైనా ఆడే సినిమానేనా..లేక కాంబినేషన్లు చూపించి అంటగట్టే సిిినిమానా అంటూ డౌట్లు కూడా ప్రారంభం అయ్యాయ్. 

Comments