మహేష్ ఆనంద్ గుర్తున్నాడు కదా..ఇప్పుడు లేడు


మహేష్ ఆనంద్..ఓ గంభీరమైన విలన్..కృష్ణారెడ్డి దెబ్బకి కామెడీ విలన్ అయ్యాడు నంబర్ వన్‌లో..కృష్ణ  ఫ్యాన్స్ కి కూడా నచ్చేసి అతనంటే ఓ రకమైన అభిమానం పెంచుకున్నారు. తెలుగులో ఫస్ట్ లంకేశ్వరుడులో మోటు విలన్ గా కన్పించినా..అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయింది..ఎలా పట్టుకున్నాడో..ఎలా అన్పించిందో కానీ..శాడిస్ట్ విలన్ గా ఎస్వీ కృష్ణారెడ్డి నంబర్ వన్ లో తీసుకుని రీ మౌల్డ్ చేసి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చాడు. ఇది 1994లో జరిగింది.
ఆ తర్వాత సంప్రదాయం, తెలుగువీరలేవరా, జగదేకవీరుడులాంటి కృష్ణ మూవీలతో పాటు..చిరంజీవి, బాలకృష్ణ, వెంకీ,నాగార్జున సినిమాల్లో కూడా నటించాడు.
అదే మహేష్ ఆనంద్ పాపం..నిన్న చనిపోయాడు..ముంబై కూపర్ ఆస్పత్రిలో పోస్ట్ మార్టమ్ కి పంపించారని అంటున్నారంటే..ఆయన మరణంపై సందేహాలు ఉన్నాయని తెలుస్తోంది. హిందీలో  ధర్మేంద్ర, అమితాబ్, గోవిందా, సంజయ్ దత్, సన్నీడియోల్ లాంటి పెద్ద హీరోల పక్కనే నటించిన మహేష్ ఆనంద్..సినిమాల్లో కన్పించక 18 ఏళ్లు అయింది..ఐతే ఈ ఏడాది రంగీలా రాజా అనే గోవిందా సినిమాలో ఆరు నిమిషాల క్యారెక్టర్లో కన్పించాడు.. ఈ 18 ఏళ్లూ
అతనికి సినిమాలు లేవట..

ఇంకా దారుణం ఏంటంటే..పొట్టగడుపుకోవడానికి మహేష్ ఆనంద్..రెజ్లింగ్ పోటీలు..కుస్తీలు కూడా చేయాల్సి వచ్చిందట..రంగీలారాజా తర్వాత తనకి రెండో మూడో ఆఫర్లు వస్తాయనే ఆశతో ఉన్నట్లు స్వయంగా ఫేస్ బుక్ పోస్ట్ లో చెప్పుకున్న మహేష్ ఆనంద్..ఇలా చనిపోవడం విషాదమే. డబ్బులేనప్పుడు వచ్చే కష్టాలను ఎదుర్కొన్నట్లు
తన చివరి ఇంటర్వ్యూల్లో చెప్పుకున్న మహేష్ ఆనంద్..కెరీర్..జీవితం చివరికి ఇలా ముగియడం సినిమాయే

Comments