మంత్రులకు పార్టీ మారాల్సిన అవసరం లేదు..అఖిల ప్రియ మాటల్లోని మర్మం

ప్రస్తుతానికి టిడిపిలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాము పార్టీ మారమని చెప్తున్నారు. ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరడం అలవాటు చేసుకున్నవారిని ఎన్నికలకు ముందు ఎవరైనా మీరు మళ్లీ ఎప్పుడు పార్టీ మారుతున్నారంటూ అడగడం సహజం..అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే..ఫిరాయింపులకు అలవాటు పడిన ప్రజా ప్రతినిధులు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ  అభివృధ్ది అనే నినాదానికి కట్టుబడి పని చేస్తారు..ఆ విషయంలో వాళ్లకి పాపం ప్రజలే అలా చేయాలని నిర్దేశించారంటూ అసలు తప్పు వాళ్లపైకి నెట్టేసే విద్య కూడా బాగా తెలుసు

మొన్నటి వరకూ తండ్రి అనుచరుడిగా తిరుగుతూ..తర్వాత కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న సుబ్హారెడ్డి కాస్తా అడ్డం తిరిగేసరికి ఇక్కడ స్వపక్షంలోనే లుకలుకలు బైటపడుతున్నాయ్. పైగా సర్వేల పేరుతో అధినేత పార్టీలోని ఎమ్మెల్యేలు..ఎంపిలకు టెన్షన్ పుట్టిస్తుంటే..ఎవరికి వారు సీటిచ్చే పార్టీని వెతుక్కుంటున్నారు..ఇలాంటి నేపధ్యంలో  మంత్రి అఖిలప్రియగారు కూడా పార్టీ మారతారనే అనుమానాలు గాసిప్స్ చాలా రోజుల నుంచి విన్పిస్తూనే ఉన్నాయ్.

ప్రతి ఒక్క సందేహానికి సమాధానం ఇవ్వడం ఏ ఒక్కరికీ సాధ్యమయ్యే పని కాదు..అందుకే మంత్రులకు పార్టీ మారాల్సిన అవసరం ఏంటంటూ అఖిలప్రియ రియాక్టైనట్లు అర్ధం చేసుకోవాలేమో..! కానీ ఈ మంత్రులే..రేపు అసెంబ్లీ డిజాల్వ్ చేసిన తర్వాత మాజీలవుతారు కదా.  ఓ వేళ అప్పుడు మళ్లీ ఏ పార్టీ దొరికితే ఆ పార్టీలో చేరిపోయి మినిస్టర్లవ్వచ్చు అనేదే ఆ మాటలకు అర్ధమా..లేక..ఎటూ ఇప్పుడు మంత్రులమే కదా.. ఏపదవి దక్కనోళ్లు మాత్రమే పార్టీ మారాలని ఆమె  ఇన్ డైరక్ట్ సెటైరా అనేదే తెలుసుకోవాలి. 

Comments