ఆల్ ఇండియా హీరో అంటే తెలుగోడే..ఖాన్‌లు కాదు..ట్రెండ్ సెట్ చేసిన సౌత్ ఇండియా



ఆలిండియా సూపర్ స్టార్ అంటే..సల్మాన్ ఖాన్..షారుఖ్..అమీర్ ఖాన్ కాదు..మరింకెవరు అమితాబ్ బచ్చనే అంటారా..కాదు ఆయనా కాదు..మహేష్ బాబు..లేదంటే పవన్ కల్యాణ్ వీళ్లిద్దరూ కాదంటే..ఆల్ టైమ్ ఫేవరిట్ స్టార్ రజనీకాంత్..అవును..సినిమాల సంఖ్య పరంగానే కాదు..రెమ్యునరేషన్ పరంగా అంతకంటే కాదు..ఇన్నాళ్లూ హిందీ నిర్మాతలు డబ్బాలు కొట్టుకునే కలెక్షన్ల పరంగానే..అవును మన తెలుగు సినిమాలు...పొరుగింటి అరవ సినిమాలు ఇప్పుడు హిందీ సినిమాల కలెక్షన్లని దాటిపోయాయ్. ఏదో ఒక్క సినిమా రెండు సినిమాలు కాదు..వరసగా..ప్రతి సినిమా వంద కోట్లకిపైబడే కలెక్ట్ చేస్తున్నాయ్..నిన్న కాక మొన్న వచ్చిన విజయ్( దేవరకొండ) సినిమాలు కూడా ఈజీగా వందకోట్లు తెచ్చుకుంటున్నాయ్..

దీనికి ఉదాహరణగా చూస్తే..2018 దీవాలీ సీజన్..సర్కార్ పేరుతో తమిళనటుడు సర్కార్ రిలీజైంది..గొడవలు నిరసనల మధ్య రిలీజైన   ఈ  సినిమాకి జనాల మద్దతు మాత్రం అనూహ్యంగా దక్కింది. ఏకంగా రూ.150కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా వారంలోపే...ఇదీ ఓ రీజినల్ సినిమాకి పెరిగిన బిజినెస్ పరిధిని తెలుపుతోంది..

మరి ఇదే సమయంలో  షారుఖాన్ జీరో 88.74కోట్లు, సల్మాన్ ఖాన్ రేస్ 3 166 కోట్లు..అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ 138 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసాయ్. ఓ రకంగా చెప్పాలంటే షారుఖ్ ఖాన్ కి చెన్నై  ఎక్స్ ప్రెస్ తర్వాత హిట్టనేది లేదు కలెక్షన్ల పరంగా.. సల్మాన్ ఖాన్ సంగతీ అంతే..ట్యూబ్ లైట్ పగిలిపోగా..114కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక అప్పుడప్పుడూ మెరిసే హృతిక్ రోషన్ రెండేళ్ల క్రితం వచ్చిన కాబిల్ ఫ్లాప్ అవడంతో సోదిలో లేకుండాపోయాడు. ఇతగాడికి హిట్టనేది 2013 అక్టోబర్‌లో మాత్రమే వచ్చింది. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ నిర్మాతల పాలిట కల్పవృక్షాలే కానీ..అవేం భారతదేశంలో హిట్టనదగ్గ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయవు


కానీ ఇదే సమయంలో సౌత్ సంగతి చూస్తే..విజయ్ గత 9 ఏళ్లలో 11 సినిమాలు చేస్తే..రెండు మాత్రమే ఫ్లాప్..అజిత్ సంగతీ అంతే విశ్వాసం, వేదాళం వంటి రెండు హిట్లు కొట్టాడు..అది కూడా ప్రతి సినిమా వందకోట్లకి పైబడే రెవెన్యూ సాధించాయ్. ఇక ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ రజనీ సంగతి సరే సరి..2.0 తమిళనాడులోేనే అతి పెద్ద హిట్..ఓవరాల్ గా రూ.600కోట్లు కలెక్ట్ చేసింది..దాని తర్వాత నెలకే వచ్చిిన పేటా కూడా 150 కోట్లు కలెక్ట్ చేసింది..ఇదీ ఆయన స్టామినా...

మరి మన తెలుగోళ్లేనా తక్కువ కలెక్ట్ చేసేది..మనకి ఒకళ్లకి నలుగురు హీరోలు ఉన్నారు..జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత ఫ్లాప్ అయినా మంచి వసూళ్లే సాధించింది. భరత్ అనే నేనుతో మహేష్ మరోసారి రూ.120కోట్లను టచ్ చేశాడు. రామ్ చరణ్ తేజ్ రంగస్థలంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు..పైగా ఈ రెండు సినిమాలూ ఒకే టైమ్‌లో రిలీజై..ఈ స్థాయి హిట్లు కొట్టడం తెలుగు సిినిమా ఇండస్ట్రీ సైజుని తెలుపుతోంది.

ఇలా దక్షిణనాయకులే చత్రపతులుగా మారడానికి కారణం దర్శకుడు రాజమౌళి కరణ్ జోహార్ షోలో చెప్తూ..అభిమానులు. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో..అది ఇవ్వడానికి మన హీరోలు తెలుసుకుని చేస్తారని చెప్పాడు..కానీ హిందీలో ఆ కన్ఫ్యూజన్ ఉందని చెప్పాడాయన. దీంతో పూర్తిగా ఏకీభవించలేం. ఎందుకంటే..ఆ లెక్కన హిందీ హీరోల  సినిమాలు అన్నీ పోవాలిగా..అలానే తెలుగు హీరోల సంగతే తీసుకుంటే ఓ హిట్ రాగానే ఇమ్మీడియేట్‌గా నిర్మాతలకు ప్రేక్షకులకు నరకం చూపించే సినిమా తీసి కానీ నిద్రపోరు..అలాంటప్పుడు  రాజమౌళి తన స్టేట్ మెంట్ ని ఎలా జస్టిఫై చేసుకుంటాడు.

దీనికి మనం ఇంకో కారణం చెప్పుకోవచ్చు..తెలుగు తమిళ సినిమాలపై నార్త్ లో ఇంట్రస్ట్ పెరగడం..కథా వస్తువు వారికి కూడా రీచయ్యేది అవ్వడంతో పాటు..మన మార్కెటింగ్ కూడా కలిసి వస్తుందనుకోవాలి. ఎందుకంటే ఈ రోజున కొన్ని హిందీ మూవీ  ఛానళ్లు చూస్తే..అన్నీ ఎప్పటెప్పటి సినిమాలో డబ్ అయి టెలికాస్ట్ అవుతుంటాయ్.
హిందీ ఖాన్‌లు ఇంకా తాము తీసినవే తీస్తుంటూ బ ోర్ కొట్టించడమూ వాటి ఫ్లాప్ లకు కారణం. ఒక్క అమీర్ ఖాన్ మాత్రమే రొటీన్ మూవీలకు భిన్నంగా తీస్తూ వస్తున్నాడు. కారణాలేదైతేనేం...ఇకపై తెలుగు సినిమా అంటే కేవలం రీజినల్ సినిమా కాదు..తెలుగు భాషలో వచ్చే ఇండియన్ సినిమా. అందుకే ప్రేక్షకులేమో కానీ..ప్రొడ్యూసర్లు మాత్రం పెరిగిన మార్కెట్‌పై హ్యాపీగా ఉన్నారు.

Comments