ఇదే నిజమైతే..జగన్‌ని ఎవరూ క్షమించరు..


రాజకీయాల్లో హత్యలుండవ్..ఆత్మహత్యలే ఉంటాయ్.. కానీ..హత్యలతో పాటు..జరిగే ఆత్మహత్యలూ ఉంటాయా?
శివారెడ్డి చస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు..చంపితే మర్డరర్  కదా అవుతారు..ఇది ఏ సినిమాలో డైలాగో అందరికీ గుర్తుండే ఉంటుంది..
ఉదయం లేవగానే వివేకానంద రెడ్డి చనిపోయారన్న వార్త..ఆ తర్వాత అది మరణం కాదు హత్య అని తెలిసేసరికే అన్ని పరిణామాలూ వేగంగా మారిపోయాయ్. తలకాయ మీద మెడకాయ ఉన్న ఎవరికైనా తెలిసేది..గుండెపోటుతో చనిపోయిన మనిషి శరీరంపై పడ్డ గాయాలే తప్ప...శరీరంపై నరికిన గాయాలు ఉండవని..పైగా రెండు మూడు లీటర్లు రక్తం కిందపోదు( ఓ వేళ అది అతని రక్తమే అయి ఉంటే) .  ఐనా ఉదయం 8 గంటలవరకూ గుండెపోటుగానే చెప్పారు.
నిజంగా కుటుంబసభ్యులు గుండెపోటు అని నమ్మి చెప్పారా...లేక అలా  గుండెపోటు అని ప్రచారం చేసింది ఎవరు..? కుటుంబసభ్యులేనా...లేక ఇంకెవరైనా.. అలా నమ్మబలికిన వ్యక్తులకే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి కారణం తెలుస్తుంది..కనీసం హత్య ఎలా జరిగిందో తెలీకపోయినా...
సాయంత్రానికి వైఎస్ జగన్ అక్కడకి వెళ్లి..బాబాయిని చంపేశారు..పైగా ఫాబ్రికేట్ చేస్తున్నారు..అని ప్రకటించాడు..ఇప్పుడో లెటర్ కూడా ఇచ్చారు..ఈ లెటర్  ఇప్పటికిప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలి..అని అడిగాడు
అదే ప్రశ్న ఇప్పుడు అందరూ అడుగుతున్నారు.


ఓ కుటుంబసభ్యుడు చనిపోతే...ఇంట్లో సాక్ష్యాలు మాయం చేసే పని జరిగిందని..చంద్రబాబు అంటున్నారు..ఇది వాస్తవంగానే అన్పిస్తోంది..ఎందుకు చేశారు..అలా చేయాల్సిన అవసరం ఏంటి..మధ్యలో మాపై బురద జల్లడం ఏంటి..అని చంద్రబాబు అడగడం 100 పర్సంట్ కరెక్ట్..చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఎవరికైనా సరే ఈ హత్య వైెఎస్ జగన్ కుటుంబీకులు...లేదంటే వివేకానందరెడ్డి సన్నిహితులే చేసి ఉంటారని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు

ఐతే నిజంగా జగన్ ఇలా చేసి ఉంటాడా...దీంతో జగన్ కి వచ్చే లాభమేంటి..తక్షణం వచ్చే  ప్రశ్న ఇది..ఏమిటి అంటే రాజకీయ ప్రయోజనం..టిడిపిపై ఆరోపణలు చేసి..సీట్లు సంపాదించడం..సింపతీతో ఓట్లు పొందడం..కానీ ఇది వాస్తవంగా జరిగే రోజులేనా..వైఎస్ వివేకానందరెడ్డి ఎంత మంచి వ్యక్తి అయినా..ఆయన మరణంతో ఓట్లు పొందగలడం కనీసం కడప జిల్లా వరకైనా సాధ్యపడే పనేనా..? ఇది రాజకీయహత్య అనే కోణంలో విశ్లేషణ

కానీ ఫ్యాక్ట్స్ చూస్తే..వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబసభ్యులు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని ఓ పేపర్ రాసుకొచ్చింది..ఈ  సుధాకర్ రెడ్డి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడని సదరు పత్రికే రాసుకొచ్చింది.. సాక్షిలోనేమో ఎంతసేపూ వివేకానందరెడ్డి ఒంటరిగా దొరుకుతారనే ఉద్దేశంతో కాపు కాసిన బయటివారే ఇలా చేసినట్లు..రాసుకొస్తోంది..అంతే కానీ అసలు వివేకానందరెడ్డికి సన్నిహితులే ఈ పని చేశారనే కోణమే రాయడం లేదు..
ఎలాగైతేనేేం దాదాపు 70 ఏళ్ల వృధ్దుడిని హత్య చేయడం అది కూడా కుటుంబసభ్యులే చేసి ఉంటారనే అనుమానం కలగడం మాత్రం..వళ్లు గగుర్పాటుకు లోను చేస్తోంది..ఒక్క మాట చెప్పకుండా ఉండలేం..దేవుడు అన్నీ చూస్తుంటాడు..కనీసం మనసాక్షి అనేది ఉంటుంది కదా..దానికి తెలుసు..మనిషిని ఎలా శిక్షించాలో...జనం ఎటూ శిక్షించడానికి సిధ్దంగా ఉన్నారు

ఈనాడు కథనం చూడండి..
https://www.eenadu.net/newsdetails/6/2019/03/15/67889/YS-Vivekananda-Reddy-Passes-away




Comments