సుమలత..ప్రకాష్ రాజ్ గెలుపు ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో తెలుసా..?


కర్నాటకకే సంబంధించి సుమలతతో పాటు మరో నటుడు కూడా తన లక్ టెస్ట్ చేసుకుంటున్నారు..ఆయనే ప్రకాష్ రాజ్. ఇద్దరూ ఇండిపెండెంట్లుగానే బరిలో దిగడం విశేషం అయితే..వీరిద్దరూ మరో అరుదైన రికార్డు ముంగిట నిలిచారు.  గడిచిన 52 ఏళ్లలో లోక్‌సభ ఎన్నికలలో..విజేతలు మాత్రం ఏదోక పార్టీకి చెందినవారే తప్ప
ఇండిపెండెంట్లు గెలిచినట్లు చరిత్ర లేదు. 1967లో మైసూరు రాష్ట్రంలోని కెనరా నుంచి దినకర్ దేశాయ్ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పార్లమెంట్‌కి ఎన్నికయ్యారు. దాని తర్వాత ఇప్పటిదాకా ఎవరూ ఆ చరిత్రని తిరిగిరాయలేదు ఐతే ఆ అరుదైన అవకాశం ఇప్పుడు సుమలత, ప్రకాష్ రాజ్ ఇద్దరికీ పుష్కలంగా ఉన్నట్లు కన్పిస్తోంది.

 అలాగని అసలు ఇండిపెండెంట్లే పోటీనే చేయలేదా..అంటే  చేసారు..2337మంది అభ్యర్ధులు 16 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినా..విజేతలు కాలేకపోయారు. జాతీయపార్టీలు..లేదంటే లోకల్ పార్టీలవైపే ఓటర్లు మొగ్గుచూపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా..కర్నాటకలో పేరు పొందిన ఏ ఒక్క వర్గం కూడా పార్టీలవైపే మొగ్గు చూపాయి కానీ..వ్యక్తులవైపు కన్నెత్తి కూడా చూడలేదని తెలుస్తోంది. ఇప్పుడు  బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రకాష్ రాజ్, మాండ్యా నుంచి సుమలత పోటీ చేస్తున్నారు.

సుమలతకి ఇప్పటికే భర్త అంబరీష్ ద్వారా సంక్రమించిన అభిమాన, అనుచరగణంతో పాటు స్వయంగా ఆమెకి ఉన్న ఫాలోయింగ్ కూడా ప్రతి చోటా కన్పిస్తోంది.
ప్రకాష్ రాజ్ ఇక్కడ నటుడిగానే కాకుండా..సాహితీవేత్తగా..యాక్టివిస్ట్‌గా మంచి పేరుంది. యాంటీ మోడీ నినాదాన్ని బలంగా విన్పించిన ప్రకాష్ రాజ్..ఇక్కడి ముస్లిం ఓట్లను కొల్లగొట్టగలరని అంచనా. 

Comments

  1. బిజెపి మద్దతు ఉంది కాబట్టి సుమలత గెలిచే అవకాశం ఉంది కాని ప్రకాష్ రాజ్ ఓడిపోతాడు.

    ReplyDelete

Post a Comment