టిడిపి,జనసేన, కాంగ్రెస్ ఒకటేనా..హర్షకుమార్ పెద్ద షాకే ఇచ్చాడా..ఉన్నదే చెప్పాడా

పాపం హర్షకుమార్ అటు టిడిపి ఎంపిగా పోటీ చేయబోతున్నాడనగానే..ఏదోక గూట్లో రాజకీయం కొనసాగించాలి కాబట్టి చేరిపోయాడు కామోసు అనుకున్నారు..కానీ ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. పనిలోపనిగా టిడిపి-పవన్ కల్యాణ్ మతలబు బైటపెట్టేశాడు..అసలు టిడిపినే జనసేనలోకి లీడర్లను దింపుతోదంటూ కామెంట్ చేశాడు..ఆయన మాటలకు జనసేనకు దడ పుట్టించేస్తున్నాయ్

జేడీ లక్ష్మీనారాయణ అటూ ఇటూ తిరిగి జనసేనలోకి పోవడం వెనుక టిడిపి ప్లాన్ ఉఁదని గుసగుసలు ఇప్పుడు హర్షకుమార్ మాటలతో నిజమే అని నిర్దారించుకోవాల్సి వస్తోంది. తెలుగుదేశం..జనసేన, కాంగ్రెస్ మూడు ఒకటే అన్నాడు హర్షకుమార్..దళితులకు సీట్లు కేటాయించడంలో టిడిపి, వైసీపీ కూడా ఒకేలా బిహేవ్ చేస్తున్నాయంటూ ఆక్రోశించాడు..హర్షకుమార్ పాపం రాజమండ్రిలో ఇలా మాట్లాడటం అటు  ఉండవల్లికి కూడా నచ్చినట్లు లేదు..

హర్షకుమార్ కామెంట్లు జగన్ మోహన్ రెడ్డిపై చేసినవి..ఏమిటంటే..దళితులపై దాడి జరుగుతుంటే ఏం మాట్లాడలేదని..పైగా ఉండవల్లి, తానూ ఇద్దరం ఎన్నో ఏళ్లుగా చంద్రబాబుని ఏకి పారేస్తోంది జగన్ కోసమే అని..అయినా జగన్ మాత్రం దాన్ని వాడుకోకుండా టిక్కెట్లు అమ్ముకున్నాడంటూ సదరు పార్టీ టిక్కెట్లు ఎవరెవరికి ఎలా కేటాయించారో మీటింగ్ పెట్టి మరీ చెప్పేశాడు..ఇంకా ఇప్పటిదాకా చెప్పని నిజం..కూడా చెప్పేసుకున్నాడు..వైఎస్సార్సీపీలో జాయినవుదామని అనుకున్నా..జగన్ మాత్రం మొహం కూడా చూడలేదంటూ వాపోయాడు..ఇంత ఆక్రోశం ఇలా దాచిపెట్టుకుంటే ఎలా..ఓ మెట్టు దిగైనా పార్టీలోకి వెళ్లాలి..బొత్స సత్యనారాయణలాగా..నిజంగా హర్షకుమార్ జగన్ పార్టీలోకి వెళ్లాలనుకుంటే అది ఉండవల్లి ద్వారా చేయించుకోవాల్సింది..
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని కూడా వదల్లేదు..నిజంగా మనుషుల్లో ఉంటూ కూడా ఇంత భయంకరంగా యాక్ట్ చేయగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణేనంటూ హర్షకుమార్ కామెంట్ చేయడం పవన్ ఫ్యాన్స్ కి చిరాకు పుట్టించేదే మరి..

Comments