పవన్ కల్యాణ్, టిడిపి స్వరాల్లో ఒకటే గళం..ఎన్నికల తర్వాత పొత్తు తప్పదా


"మనపై బిజెపి, టిఆర్ఎస్, వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తున్నాయ్..ఏం తమ్ముళ్లూ ఊరుకోవాలా..లేదు కదా..ఈ దొంగల పార్టీలు మనల్ని ఏమీ చేయలేవు..అవునా కాదా..అని అడుగుతున్నా...ఖబడ్దార్ ఏమనుకున్నారో...నాకు భయం లేదు..వీళ్లు భయపెడితే భయపడతానా...చెప్పండి తమ్ముళ్లూ..".( ఇదే ధోరణి ఎక్కడకి వెళ్లినా) ఏకథాటిగా చెప్పిందే చెప్తూ..కనీసం రెండు గంటలసేపు మాట్లాడటం చంద్రబాబుగారికే చెల్లింది. అంత ఓపికగా..జనం వింటున్నది..విననిది కూడా పట్టించుకోకుండా 70ఏళ్ల వయసులో ఎండల్లో తిరగడం చూస్తుంటే..ఈ ఎన్నికలు ఆయనకి ఎంత ముఖ్యమో అర్ధం అవుతుంది
పైన చెప్పిన మొదటి లైన్లోనే మీకో పార్టీ తప్పిపోయింది..ఆ పార్టీ కూడా  అభ్యర్ధులను ప్రకటిస్తోంది..ఐనా సరే ఎక్కడా ఆ పార్టీపై విమర్శలు గుప్పించడం లేదు..ఎస్ మీ ఊహ నిజమే..ఆ పార్టీనే జనసేననే..ఎందుకంటే "జనసేనలో జేడీ లక్ష్మీనారాయణ జాయిన్ అయ్యాడు తమ్ముళ్లూ...ఇకనైనా జేడీ నోరు తెరవాలి...జగన్ పై వాస్తవాలు చెప్పాలి|" అంటూ చంద్రబాబుగారు డిమాండ్ చేసారు..
నిజంగా ఏ వాస్తవం చెప్పాలాయన...90 రోజులలో ఛార్జీషీటు వేయాల్సి ఉండగా...ఖచ్చితంగా 89వ రోజు సాయంత్రానికి ఛార్జీ షీట్ వేయడం వెనుక మతలబునా..ఇంతవరకూ నేరాభియోగ కార్యక్రమమే పూర్తి కాకుండా విచారణ పేరుతో కోర్టుల చుట్టూ తిప్పడమా...పోలీసులు కోర్టులో నేరాభియోగం పూర్తి చేస్తే...ఆ తర్వాత జడ్జి గారు అవన్నీ చూసి విచారణకు అర్హత ఉన్నాయనుకుంటే..అప్పుడు విచారణ ప్రక్రియ ప్రారంభిస్తారు..మొత్తం పదహారో..పదకొండో కేసులు అలా పెట్టారు జగన్ పైన..అందుకే ఈ కేసులన్నింటినీ ఒకటే కోర్టు..ఒకేసారి అభియోగాలు ఆరోపిస్తే..వాటిని కోర్టు ఓకే చేస్తే..అప్పుడు జగన్ పై కేసుల విచారణ ప్రారంభం అవుతుంది..ఇదీ పద్దతి..(న్యాయవిచారణ ప్రక్రియ) ఇంత సుదీర్ఘమైనది ఉంటే..అక్కడికేదో మొదటి దశ నుంచి చివరిదాకా అంతా అయిపోయినట్లు..టిడిపి చేసే హడావుడి అంతా ఇంతాకాదు..కానీ ఆ కేసులలో ఇంతవరకూ నేరాభియోగాల  ప్రక్రియే పూర్తి కాలేదు..( తెలీకుండా ఎవడు ఏదేదో వాగుదామని ట్రై చేయవద్దు) . మరి ఈ విషయాలన్నీ నిజంగానే జేడీగారు చెప్పగలరా...సొంత పార్టీ అంటూ తిరగడం..ఆ తర్వాత ఢిల్లీలో ధర్నాలు..ఆ తర్వాత బిజెపిలో జాయిన్ అయితే ఎలా ఉంటుందని ఆరా తీయడం..ఆ తర్వాత టిడిపిలోకి పోదామనుకోవడం..వీటన్నింటికంటే ముందు లోక్ సత్తా స్వీకరిద్దామని అనుకోవడం..ఇన్ని డాలు ఉన్న చోట..ఇప్పుడు జనసేనలో దూరిపోవడం వెనుక కథ ఎవరికి తెలీదు..అందుకే ఇప్పుడు ఓ ముసుగు 50శాతం తొలగిపోయింది

కట్ చేస్తే..ఇక్కడ భీమవరం నామినేషన్  దగ్గరా పవన్ కల్యాణ్ ది అదే మాట..భీమవరంలో రౌడీయిజం చేస్తే సహించను..విశాఖలో జేడీని దింపాం..జగన్‌కి వణుకు పుడుతోంది. అంటాడు పవన్ కల్యాణ్..అలానే భీమవరంలో పులివెందుల రౌడీలను తరిమికొడతాం అంటాడు..మళ్లీ అంతలోనే కేసీఆర్ కి ఏపీలో ఏం పని అంటాడు..మారిన భాషలో చంద్రబాబు లాంగ్వేజ్ కన్పిస్తుండటం చూస్తుంటే..పూర్తి చంద్రకల్యాణ్ గా మారిపోయిన పవన్‌లా కన్పిస్తే ఆశ్చర్యం ఏముంది..ఆయన డిమాండ్ ఈయన నోటి నుంచి..ఈయన మాటలు ఆయన గొంతు నుంచి క్లియర్ గా కన్పిస్తున్నాయిగా..ఐనా అంతలోనే జనసేన ఎన్నికలలో గెలిచి ఖాళీగా ఉన్న 3లక్షల ఉద్యోగాలు పిల్ చేస్తామంటాడు..నిన్ననేగా హర్షకుమార్ అన్నది..వామ్మో...జనంలో కూడా అంతగా బీభత్సంగా యాక్ట్ చేసేవాడు ఇంకోడు లేడు అన్నది..అందుకే ఇక్కడి ముసుగు కూడా తొలగిపోయింది..ఇక రాజకీయ కన్యాశుల్కంలో మధురవాణి మరోసారి వచ్చేసిందంటూ ఫేస్ బుక్‌లో మరో మిత్రుడు గోల పెడుతున్నాడు

Comments