మహేష్, పవన్ కల్యాణ్‌కి ధీటుగా ఈ హీరోయిన్ రెమ్యునరేషన్..పాతిక కోట్లట


తెలుగు చిత్రసీమలో భారీగా పారితోషికం తీసుకునేదెవరంటే టక్కున గుర్తొచ్చేది పవన్ కల్యాణ్..మహేష్ బాబు..సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా..ఇప్పట్లో అన్ని రైట్లు కలిపి మహేష్ సినిమాలు కనీసం వందకోట్లు కలెక్ట్ చేస్తున్నాయ్...పవన్ కల్యాణ్ సినిమాలకు దాదాపు స్వస్తి చెప్పిన తరుణంలో మహేష్ బాబే నంబర్ వన్ అని చెప్పాలి..ఐదారేళ్లకి ఒక సినిమా చేసే హీరోలతో పోటీ పెట్టకుండా..కనీసం ఏడాదికి  ఒకటి తీసే హీరోలలో ఈ లెక్క సరైనదే.. దగ్గర దగ్గర పాతికకోట్ల వరకూ మహేష్ తీసుకుంటాడని ఓ టాక్

ఐతే ఈ హీరోకి దగ్గరగా ఓ హీరోయిన్ వచ్చేసింది..ఐతే ఆమె తెలుగో..తమిళ నటో కాదు..హిందీ సినిమాల నటి..కంగనా రనౌత్..అందం పెద్దగా ఉండదు..గ్లామర్..అస్సలు ఛాన్సే  లేదు..కేవలం నటన మాత్రమే ఆమెని అందలం ఎక్కించింది..అందులో ఖాన్ దాన్‌తో పాటు ఇతర హీరోలపై కామెంట్లు చేయడం..వారిని రియల్ గా కూడా ఢీ అంటే ఢీ కొట్టడం ఆమె ప్రత్యేకత..ఝాన్సీ కీరాణి ిిసినిమా హిట్టైన తర్వాత ఆమె ఇమేజీ...సినిమాల పరిధి చాలా పెరిగిపోయింది
ఇప్పుడు తాజాగా జయలలిత జీవితంపై తీసే సినిమాలో కథానాయిక పాత్రలో ఆమెనే నిర్మాతలు సంప్రదించారట. దీనికోసం దాదాపు 25కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పారితోషికంగా పన్నెండు కోట్ల రూపాయలు..డిస్ట్రిబ్యూషన్ లాభాల్లో పన్నెండు కోట్లు ముట్టజెప్పనున్నట్లు టాక్..ఐతే ఈ ప్రచారాన్ని అటు నిర్మాతలు..హీరోయిన్ వర్గాలు ఖండిస్తున్నాయ్. ఇంత తీసుకున్నా కూడా..బాలీవుడ్ ఖాన్‌లు తీసుకునే 50కోట్ల రెమ్యునరేషన్‌లో కంగన రనౌత్‌ది సగమే కావడం గమనించాలి..ఐతే ఈ రేంజ్ రెమ్యుూనరేషన్ మాత్రమైనా దక్కిందంటే అది కేవలం కంగనకే అంటున్నారు జనం

Comments