స్లోగన్లు కాదు..దమ్ముంటే మిలటరీలో చేరండి..మీడియాకి కూడా చురకలు వేసిన సైనికుడి భార్య

పాప పేరు నివేద..చూస్తున్నది ఏ పూలదండనో కాదు..తన తండ్రిని ఉంచిన కాఫిన్ బాక్స్‌ని. గుండెలు పగిలే శోకం అంటారే..అలాంటి సన్నివేశమే ఇక్కడ కన్పిస్తోంది..ఫిబ్రవరి 28న కాశ్మీర్‌లో హెలికాప్టర్ కూలి చనిపోయిన పైలెట్లలో నినాద్ మండవాగ్ని కూడా ఒకరు..ఆయనకి ఓ రెండేళ్లపాప..అంత్యక్రియలకు ముందు తన తండ్రికి చివరి ముద్దులు..చివరి శాల్యూట్ చేసింది..పక్కన ఉన్నది అతని భార్య విజేత..నాసిక్ లో జరిగాయి నినాద్ వీడ్కోలు కార్యక్రమాలు..చిన్నవయసులోనే ఎంత శోకమో..మనం మాటల్లో చెప్పుకోవడమే కానీ వారి కుటుంబం బాధ అంతా ఇంతా కాదు..

చెప్పడానికి లక్ష చెప్తాం..కానీ అనుభవించేటప్పుడు ప్రతి రోజూ నరకమే..తండ్రి ఇంకా లేస్తాడని..తిరిగి వస్తాడని ఆ చిన్నారి ప్రతి రోజూ ఎదురు చూస్తుండొచ్చు..అర్ధం కాని భాషలో అడుగుతూ ఉండొచ్చు..రాలేదేంటని..మనసులో రోదించవచ్చు..కొన్నాళ్లకి మర్చిపోవచ్చు..కానీ అది ఎంత బాధ..బాధకి పరాకాష్ట కదా..మన ఇంట్లో పిల్లాపాపలతో హాయిగానే బతుకున్నాం..ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసు కరుగుతుంది..

ఏదో చేయాలని ఉంటుంది..కానీ ఏం చేయలేం..ఒకటి మాత్రం చేయగలం..ఇలాంటి కుటుంబాలకు ఆర్ధికంగా సాయం చేయగలం..అంటే వారికేదో లోటు ఉంటుందని కాదు కానీ..డబ్బు కోసం వారు ఇబ్బంది పడకుండా ఉండాలనే తపనతోనే అలా చేయగలం..కానీ నినాద్ భార్య ఏమంటుంటుందో తెలుసా

మీరు నినాదాలు ఇవ్వకండి..ఏదోక దేశానికి వ్యతిరేకంగా స్లోగన్లు ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదు..దమ్ముంటే (ఈ పదం వాడలేదు) రక్షణరంగంలో జాయినవ్వండి అన్నది..అలానే మీడియా కూడా బాధ్యత మరిచి ప్రవర్తించిన తీరుని సూటిగా కడిగేసింది( దున్నపోతు మీద వాన పడ్డట్లే అని దులుపుకుపోయేవారికి ఎవరేమంటే ఏంటి) కనీసజ్ఞానం లేకుండా వార్తలు ఎందుకు ప్రసారం చేస్తున్నారని నిలదీసింది. చేతనైతే మహిళలను గౌరవించండి అంటూ విన్నవించుకుంది..అలానే పబ్లిక్ ప్రదేశాలలో యూరిన్ పోయవద్దని కూడా చెప్పింది..ఇలా ఎందుకు చెప్పిందో అర్ధం చేసుకునే జ్ఞానమే ఉంటే..ఇలా ఆమె వాపోవాల్సిన అవసరం ఏముంది..
ఐనా మనం స్పందించం..దేశం సరిహద్దుల దగ్గర పోరాడే సైనికులకు కనీసం గౌరవం ఇవ్వం..అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిపాటు ఆర్మీలో పని చేయాలనే నిబంధన పెట్టాలి..అప్పుడే కష్టం అంటే ఏంటో తెలిసి వస్తుంది..చచ్చే వార్తలను కూడా..పకోడీ తింటూనో...మసాలా దోశ తింటూనో ఎంజాయ్ చేసే మనస్తత్వాలు మారతాయ్

Comments

Post a Comment