ఈ ఎమ్మెల్యే నోటి తీట అంతా ఇంతా కాదు సోనియాగాంధీ కూడా డ్యాన్సరేనట



నేతల నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది..నోరు జారిన ఒక్కసారైనా ఎలాంటి శిక్ష పడకపోవడంతోనో..లేక మనల్ని ఎవరేం చేస్తారనే ధీమాతోనో కానీ ఏది పడితే అది మాట్లాడుతుంటారు..ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ అలానే నోరు పారేసుకున్నాడు..రాహుల్ గాంధీ ఓ డ్యాన్సర్‌ని పెళ్లి చేసుకోవాలంటూ తన పైత్యం ప్రదర్శించారు
ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తన నోటి దురద ప్రదర్శించారు. ఈసారి సోనియాగాంధీ ఫ్యామిలీపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ ఇటలీలో ఓ డాన్సర్ అంటూ... సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆమెను రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకొని తన ఇంటి మనిషి చేసుకున్నారన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన డాన్సర్ సప్నా చౌదరిని కూడా రాహుల్ పెళ్లి చేసుకోవలని సూచించారు సరేంద్ర సింగ్. అప్పుడు అత్తాకోడళ్లు.. ఒకే సంస్కృతి, వృత్తికి చెందినవారవుతారంటూ ఎద్దేవా చేశారు.

 హర్యానాకు చెందిన ప్రముఖ డ్యాన్సర్, గాయని సప్నా చౌదరి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు...లేదు లేదు నేను ఆ పార్టీలో చేరలేదూ అని సప్నా చౌదరి అంటోంది అది వేరే విషయం..పైగా బిజెపి ఎంపి ప్రమోద్ తివారీతో ఫోజులు కూడా ఇస్తోంది..

ఐతే సప్నా అందం చూసి నోటితోనైనా శీలం తీద్దామనుకున్నాడో ఏమో కానీ  ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స్పందిస్తూ.. భారత ప్రజలు ఓ నర్తకికి దేశాన్ని నడిపే అవకాశం ఎప్పటికీ ఇవ్వరన్నారు. అందుకే సమర్థుడైన , నిజాయితీపరుడైన మోదీకి ప్రజలు అధికారం అప్పగించారన్నారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా సురేంద్రసింగ్ తన నైజం మరోసారి బైటపెట్టుకున్నారు..సప్నా చౌదరి ఓ డ్యాన్సరే కావచ్చు కానీ..అదేం తప్పుడు పని కాదు..ఆ విషయానికీ రాహుల్ గాంధీ పెళ్లికి లింక్ పెట్టడం ఏంటో ..ఆయనకే తెలియాలి గతంలో కూడా ఇతగాడి అనుచరులు ఓ డిఈఓని ఇలానే చుట్టుముట్టి చావబాదారు. ఈ మధ్యనే మాయావతిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు ఏకంగా యూపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై నోరుజారడంతో మనోడుత్త నోటి దూలగాడనే కామెంట్లు వస్తున్నాయ్

Comments