నువ్ యాక్టర్‌గా ఓకే..కానీ రాజకీయాల్లో మాత్రం మాకిష్టం లేదు


 పార్టీ...మక్కల్ నీతి మయ్యం..నినాదం..రేపు మాదే..పార్టీ సింబల్ టార్చి లైట్ ..చూడటానికి ఓ కొత్త పార్టీ..ఆదర్శవంతంగా కన్పిస్తోన్న పార్టీ..అందులోనూ సూపర్ స్టార్ కమల్ హసన్ పార్టీ..ఓ వైపు కరుణానిధి..మరోవైపు జయలలిత ఇద్దరూ లేని తరుణంలో కమల్ ఎంఎన్ఎం పార్టీకి భారీగా ఆదరణ ఉండాలి..కానీ వాస్తవానికి అక్కడంత సీన్ కన్పించడంలేదు..కమల్ హసన్ ర్యాలీకి వెళ్తే కనీసం వెయ్యిమంది
కూడా కన్పించడం లేదు. ఆయన ఇస్తున్న ప్రసంగాలు హాజరవుతోన్న కొద్దిమందిని ఆకర్షించవచ్చు

కానీ..ఓట్లరూపంలో మాత్రం ఆయనకి నిరాశే మిగలవచ్చని అంటున్నారు కొంతమంది మాత్రం ఆయనలో మార్పుతెచ్చే లీడర్‌ని చూస్తున్నా..ఎక్కువమంది మాత్రం కమల్ హసన్‌ని నటుడిగానే ఎక్కువ ఇష్టపడుతున్నట్లు
చెప్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో పొత్తు పెట్టుకున్న మక్కల్ నీతి మయ్యం 39 పార్లమెంట్ స్థానాలకు 18 అసెంబ్లీ ఉపఎన్నికలకు పోటీకి దిగింది. ద్రవిడ పార్టీలైన అన్నాడిఎంకే, డిఎంకేకే ఓటేయడం అలవాటైన అరవతమ్ముళ్లలో చాలామంది కమల్ హసన్ ఫ్యాన్స్ ఉన్నారు..ఐతే వారంతా కూడా
ఎంఎన్ఎంకి ఓటేయబోమని చెప్తుండటం గమనార్హం.

ఈ ప్రమదాన్ని గ్రహించే రజనీకాంత్ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెప్తున్నారు. నిజానికి గత ఏడాది
అంటే 2018 ఫిబ్రవరిలో పోటీ పెట్టి..ఏడాదిలోపే ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమైన పనే..పేదరికం నిర్మూలన..50లక్షలఉద్యోగాలు..ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్ మహిళా కూలీలకు సమానవేతనం కమల్ హసన్ మేనిఫెస్టోలోని హైలైట్స్..ఐతే పార్టీ పెట్టి ఏడాది కాకముందే మక్కల్ నీతి మయ్యంలో కుమ్మలాటలు ప్రారంభం అయ్యాయ్.కేసీ కుమరవేల్‌ అనే వ్యాపారవేత్త ఇలానే బైటికి రావడం గమనార్హం. ఐతే పార్టీ మాత్రం అధికారికంగా ప్రకటించకముందే ఆయన కడలూర్‌నుంచి ప్రచారం ప్రారంభించారని..అందుకే సాగనంపినట్లు చెప్తోంది. ఏప్రిల్ 18న ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత వచ్చే ఫలితాలే కమల్ హసన్ మక్కల్ నీతి మయ్యం భవిష్యత్తుని నిర్ణయిస్తాయంటున్నారు

Comments