రౌడీ లీడర్లకి పోలీస్ పౌరుషం చూపిస్తే..ఇప్పుడా పోలీసులే విలన్లుగా మారొచ్చా


అనంతపురం బ్రదర్స్‌కి చుక్కలు చూపించాడు..పోలీసులంటే పెతీవాడీకి అలుసైపోయింది..స్టీఫెన్ రాజ్ నిన్ను పరుగులు పెట్టించినప్పుడు ఏం పీకావ్..మా జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ జేసీ ఖాన్‌దాన్‌కి మీసం మెలేసి మరీ తొడగొట్టి సవాల్ చేసినప్పుడు పోలీస్ శాఖ గౌరవం ఒక్కడన్నా నిలిపాడు అనుకున్నారు. జేసీ బ్రదర్స్ ఏ రేంజ్ లో మాటలు తూలుతారో..ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం..ఐనా సరే పోలీసులలో ఎవరూ గోరంట్ల మాధవ్ లాగా వార్నింగ్ ఇచ్చింది లేదు..అలాంటి మాధవ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది

మరి మొదట్నుంచీ రావాలనుకున్నాడో...జేసీలాంటోళ్లకి ఇలాంటోడే మొగుడు అనుకున్నాడో కానీ జగన్ వెంటనే గోరంట్ల మాధవ్ కి హీందూపురం ఎంపీ సీటుకు టిక్కెట్ ఇచ్చేశాడు..కానీ ఇక్కడే ఏపీ పోలీస్ ఎవరి కన్నుసన్నల్లో పని చేస్తున్నారో తెలుసుకునేందుకు గొప్ప ఎగ్జాంపుల్ దొరికింది. అతను రాజీనామా చేస్తే..రిలీవ్ చేయాల్సిందే..కనీసం వారం క్రితం వరకూ అయినా చేయాల్సిందే..ఐనా రిలీవ్ చేయకుండా..ఉఁటే నామినేషన్ వేయలేరని వాళ్ల ఫీలింగ్ కాబోలు..కోర్టుకి వెళ్లి మరీ తన రిలీవ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు మాధవ్..ఐనా సరే దున్నుపోతుమీద వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారంటే దాని వెనుక ఎవరి మంత్రాంగం ఉందో తెలీడం లేదా..

కానీ పోలీస్ శాఖకి రోషం ఉందని ప్రూవ్ చేసినవాడిపై ఇలా పోలీసులే తమ వెన్నెముకలేనితనం చూపిస్తే ఎలా..రేపొద్దున్న గతిలేక రిలీవ్ చేయవచ్చేమో కానీ..గోరంట్ల మాధవ్ విషయంలో ఇలా చేయడం వలన ఏపీ గవర్నమెంట్ పెద్దల బుద్ది లేనితనమే కన్పిస్తుంది అందరికీ..ఇంకా అంతకంటే చేవచచ్చిన పాము ఏదంటే..ఎలక్షన్ కమిషన్..రిలీవ్ చేయాలని అర్డర్ ఉన్నా చేయడం లేదని సిఈసీకి కంప్లైంట్ చేస్తే..ఈ విషయంలో ఈసీ ఏమీ చేయలేదని గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పుకోవడం..అటు తెలంగాణలో ఓటర్ల లిస్టులో భారీగా అవకతవకలు జరిగాయి..సారీ అంటూ ఓ హీరోగారు చెప్పుకుంటే..ఈయనేమో ఇంతకంటే మేమేం చేయలేమని..చేతులెత్తేయడం ఎలక్షన్ కమిషన్ చేతగానితనానికి ఉదాహరణ

Comments