అశోక్ బాబు..కాల్వ శ్రీనివాసులు..నారా లోకేష్...ఇలా అంతా నీళ్లు నములుతున్నారే


ఏపీ ప్రభుత్వడేటాని తెలంగాణ పోలీసులు హ్యాక్ చేశారు..ఇది సిగ్గుచేటు అంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నా..ఎవరూ పట్టించుకోకపోతే ఎలా..పైగా మంత్రులు కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకోమని చెప్పారు..మరి కేసు మాత్రం ఎందుకు పెట్టరు..పెడితే హైకోర్టు ఏమని అన్నది.. ఈ చివరి రెండు ప్రశ్నలు చాలు ఎవరు ఎవరి డేటాతో ఆడుకుంటుందీ అర్ధమైపోతోంది..!

పైగా క్లియర్‌గా బుక్కైన కేసులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీగా పాపం పరుచూరి అశోక్ బాబు..అలియాస్ ఆరడుగుల బుల్లెట్  తుస్సుమన్నది..ఉదయం టివి9 చర్చలో ఏం మాట్లాడుతున్నాడో..ఏం చెప్పాలనుకుంటున్నాడో..అసలు ఓ సందర్భంలో ఏకంగా...తన అధినేతనే తన వ్యాఖ్యల ద్వారా బుక్ చేయబోయాడు..ఇంతలో యాంకరే స్పందించి..ఏదో బ్రేక్ రూపేణా కవర్ చేయాల్సి వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల డేటా టిడిపికి అందిస్తున్నారు..ఇదీ నమోదైన కేసు..లేదు మాది ప్రభుత్వ డేటా దాన్ని తెలంగాణ వాళ్లు హ్యాక్ చేసారు అని ఓ శుష్కమైన కవరింగ్ తో టిడిపి సర్దుకుంటుంది..కానీ సేవామిత్ర అనే యాప్ తయారు చేసింది..టిడిపి వాళ్ల కోసం..అదే సేవామిత్రని డిజైన్ చేసిన సదరు సంస్థనే..ఏపీ ప్రభుత్వానికి డేటా సేకరించి ఇస్తోంది..అంటే రెండుపనులు చేస్తోంది..ఒక  సంస్థనే..కానీ ప్రభుత్వానికి అందించిన డేటాని టిడిపికి అందించడం మోసం..దుర్మార్గం..పైగా సేవామిత్ర టిడిపి మెంబర్ల డేటా మాత్రమే అని చెప్పుకోవడం ఇంకాస్త హాస్యాస్పదం..ఓ వేళ అదే నిజమైతే..సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడాల్సిందే తప్పులేదు..కానీ ఇలా పారిపోవడం ఏంటట

అదే చేస్తోంది సదరు ఐటి గ్రిడ్ అని ఆరోపణలు వచ్చినప్పుడు కేసులో లొంగిపోవాలి..లేదంటే కోర్టులో ఆ విషయం చెప్పుకోవాలి..అంతేకానీ నన్ను కిడ్నాప్ చేస్తున్నారు..నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని ఏపీ పోలీసులకు చెప్పుకోవడం ఏంటి..వాళ్లు అంతే స్థాయిలో స్పందించడం ఏంటి..ఆ స్పందనని చూస్తేనే అయ్యవారు మనవారికి కావాల్సిన వారని అర్ధమవుతోంది..అసలు ఐటీ గ్రిడ్ ఓ ఫ్రీలాన్సింగ్ సంస్థ అంటారా..సరే సరే..అలానే అనుకుందాం..ఫ్రీలాన్సింగ్ సంస్థ దగ్గరే వ్యక్తుల తాలుకూ ఆధార్ డేటా  ఉండొచ్చా..ఉండకూడదు కదా..సుప్రీంకోర్టు అలా చేస్తే ఏం చేయాలో ఓ తీర్పు ఇచ్చింది..మరి దాన్ని అమలు చేయాలని కోరతారా..
సరే మాకేంటి సంబంధం ఐటీ గ్రిడ్ తో అని పరుచూరి అశోక్ బాబు అమాయకంగా ఉదయం అనేశారు..సరే  సంబంధం లేదు కదా..మరెందుకు ఇఁత నానాయాగీ చేస్తున్నారు..అతనిపై ఎంక్వైరీ చేయడం ఏపీ సంస్థలను బెదిరించడమా..
ఇంకొక ట్విట్టర్ పిట్ట అంటుంది..ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసిందట..ఏదీ సదరు పొలిటికల్ పార్టీలకు డేటా సేకరించి(తస్కరించి) ఇచ్చే మాహ గొప్ప కంపెనీపై రెయిడ్స్ చేస్తే...హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందా..ఛ దేంతో నవ్వాలి గురూ మేం. కావాలంటే కింద వీడియోలో అశోక్ బాబు చర్చలో పాల్గొన్న తీరు చూడండి

https://www.youtube.com/watch?v=qpbk8rZMx08

డేటా పబ్లిక్ డొమైన్‌లో ఉందని మరో సన్నాసి అంటున్నాడు..డేటా పబ్లిక్ డొమైన్ లో ఉంటే డిలిటీ చేయండి..లేదంటే కంప్లైంట్ చేయండి..అంతేకానీ..మా డేటాఫ్ బర్త్‌లు..ఫోన్ నంబర్లు..ఏ పార్టీకి ఫర్..దేనికి ఎగెనెస్ట్..ఇలాంటి డేటా ఎందుకు నడిరోడ్డున వేస్తారు..ఈ విషయంలో ఎవరెంత తప్పు చేసిందీ రేపొద్దున్న సుప్రీంకోర్టుకి వెళ్తే కానీ తెలీదు. ఇదేమన్నా రాత్రికి రాత్రి తోపుడు బళ్లు డిస్ట్రిబ్యూట్ చేయడమనుకున్నారా..ఆధార్ కార్డులతో సహా యాప్ లో పెట్టేయడానికి

Comments

  1. పరుచూరి అశోక బాబు & కాలువ శ్రీనివాసులు లాంటి బచ్చాలతో లాభం లేదని తాజాగా వేమూరు హరిప్రసాద్ (ఈవీఎం చోరీ ఫేమ్) & కార్వీ కుటుంబరావులను రంగంలో దింపారు.

    రేపోమాపో లోక్సత్తా జయప్రకాష్, ఇంకా సరిపోకపోతే జాస్తి చెలమేశ్వర్ కూడా రంగంలో దిగుతారేమో వేచి చూద్దాం.

    ReplyDelete

Post a Comment