వాళ్లిధ్దరినీ వెంటాడి రంధ్రాన్వేషణ చేసి మరీ తిట్టడమే స్మృతీ ఇరానీ పనా..!


కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీనే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ టార్గెట్ చేశారా..వేరే ఇక ఏ విమర్శలూ చేయకుండా..వీరిద్దరినే లక్ష్యంగా చేసుకోవాలంటూస్వయంగా బిజెపి అధిష్టానమే ఆదేశించిందా..ఈ వాదనకి బలం చేకూరేలానే ఉంది స్మృతి ఇరానీ వైఖరి..రాహుల్ గాంధీ..ప్రియాంకగాంధీ ఏ పని చేస్తే..వాటినే విమర్శిస్తూహడావుడి చేస్తున్నారు స్మృతి ఇరానీ

 రాహుల్ గాంధీ కనీస ఆదాయ భరోసా పథకం..న్యాయ్ ప్రకటించారో లేదో..దానిపై వెంటనే కామెంట్ చేసేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ..అధికారంలో ఉండగా చేయలేనిదిఇప్పుడెందుకు ప్రకటించారంటూ ఎద్దేవా చేశారు..అలానే రెండో సీటు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం బైటికి రాగానే అందరికంటే ముందుగానే ఆమె..ఎటాక్ ప్రారంభించారుబాగ్..రాహుల్ బాగ్..అంటూ చెణుకులు వేశారు..అలానే ఇప్పుడా వంతు ప్రియాంకగాంధీకి ఇచ్చారు..ఆమె అయోధ్యలో రామమందిరం దర్శించకుండానే వెను దిరగడంపై విమర్శలు కురిపించారు. రాముడిని దర్శించుకోని రామభక్తులకు జనం ఓట్లు వేయరంటూ అభిప్రాయపడ్డారు

 ప్రియాంక గాంధీ యూపీలో టూర్ చేసిన సందర్భంగా అయోధ్యలో రామ్ లల్లా-బాబ్రీ మసీద్ వివాదంపై కోర్టు పరిధిలో ఉన్నందును స్పందించబోనని చెప్పారు.అలానే దర్శనం విషయంపైనా అదే వైఖరి ప్రదర్శించారు. ఐతే స్మృతి ఇరానీ మాత్రం తన బీట్ రాహుల్, ప్రియాంకలేననే విధంగా ప్రతి కదలికనూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు
కన్పిస్తోంది. అందుకే గంగాయాత్రపై కూడా ఆరోపణలు సంధిస్తూ..విమానాల్లో తిరిగే వారు పడవల్లో తిరగడం ఎన్నికలొచ్చాయనే అఁటూ ఎద్దేవా చేశారు.వీటికి కొనసాగింపుగా అమేథీలో గౌరీగంజ్‌లో రాహుల్ భూమి ఆక్రమించుకున్నారంటూ ఆరోపించారు

అమేథీలో రాహుల్ గాంధీపై 2014లోనే ఓటమి చెందిన స్మృతిఇరానీకి బిజెపి ఆ తర్వాత మంత్రిపదవి కట్టబెట్టడం కూడా గమనించవచ్చు..ఇప్పుడు కూడా అదే స్థానం నుంచి రాహుల్‌పై పోటీ పెట్టింది..ఆయన్ని వీలైనంత చికాకు పెట్టడానికేనంటారు. మెజారిటీ తగ్గించడంతో పాటు..విమర్శకి ప్రతివిమర్శ తక్షణం చేయడమే ఎజెండాగా స్మృతి ఇరానీకి బిజెపి  బాధ్యతలు అప్పజెప్పినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయ్

Comments