నిజంగా అష్టాదశ ఎంపిలతో దశ తిరిగిపోతుందా..మరి మాయావతి..మమత, నవీన్ మాటేంటి


16 సీట్లు గెలిపిస్తే చాలు ఢిల్లీలో చక్రం తిప్పేస్తాం..ఈ డైలాగ్ వినలేక చచ్చిపోతున్నాం..ఎందుకంటే..ఇప్పటికి ఇప్పుడు 16మంది ఎంపీలతోనే చక్రం తిప్పే దశ ఉంటే..మరి 2004, 2009లో మనకి ఎన్ని సీట్లు వచ్చాయ్..కాంగ్రెస్‌కే 34 దాకా వచ్చాయ్ కదా..సరే రైటే..అది కాంగ్రెస్..మాది రీజినల్ పార్టీ అంటారా..వాకే..మరి పక్కనున్న జగనూ...చంద్రబాబూ కూడా పాతిక సీట్లంటున్నారే..వారికీ చేతకాకుండా మీరొక్కరే చక్రాలు..విష్ణుచక్రాలు తిప్పుతారా...సరే వాళ్లకంత సీన్ లేదు. ఒప్పేసుకున్నాం

.మరి పశ్చిమబెంగాల్‌లో 38 సీట్లు తెచ్చుకునే మమతాబెనర్జీ మాటేంటి..ఇంతవరకూ మీరు చెప్పుకోవడమే కానీ..వాళ్లింత వరకూ మీ ఫ్రంట్ గురించి చెప్పలేదు..పైగా ఇవాళ చంద్రబాబుగారి మీటింగ్ కి వచ్చేసింది..అంటే ఆమె టెంట్ మారిందా..లేక ఆమె ఏ టెంట్‌లో ఉంటే..అదే మీటెంట్ కూడానా..ఆ లెక్కన ఆ టెంట్‌లో చంద్రబాబూ ఉన్నాడు కదా...సరే మా మట్టిబుర్రలకు ఏమీ తెలీదు ...మరి ఒడిశా పరిస్థితేంటి..అక్కడా బిజెపి, కాంగ్రెస్‌కి గుండుసున్నానే కదా..మరి నవీన్ పట్నాయక్‌ని మీ కూటమి తరపున ప్రధానమంత్రిగా చేస్తారా..ఎందుకంటే..మనం ఎన్ని సీట్లు గెలిచినా..చివరకు పక్కనోడికే కదా తలొగ్గేది..
మరి దేశం మొత్తం ఎన్ని సీట్లలో గెలవడం కాదు..ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నదే చూసుకునే ఏనుగు పార్టీ మాయావతి ఉంది..రేపు యూపీలో పాటు..మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ గఢ్‌లో పొరపాటున ఓ 20 సీట్లు గెలుచుకుంటే నేనే పిఎం అనదా..అప్పుడైనా మీ చక్రం పళ్లూడవా బాబులూ...ఠాఠ్ ఇవన్నీ కాదు..మాజీ ప్రధానిని నేను..నాకివ్వండి సామీ కాస్త మరో ఛాన్స్ అని మన దేవెగౌడ అంటే ఏం చేస్తారు..అదీ కాదు..మా ముసలోడికి సరదా ఎక్కువైంది..మనం మనం ఒకటే సైకిల్ గుర్తొళ్లం..అని అఖిలేష్ బాబు చంద్రబాబుతో ములాఖత్ అయినా కష్టమే కదా..ఇన్ని సంక్లిష్టతలు..గందరగోళాలు ఉంటే...నాకు పదహారివ్వండి..నాకు పాతిక ఇవ్వండి అని కేసీఆర్, చంద్రబాబు కొట్టుకోవడం న్యాయమేనా..చక్రం తిప్పాలంటే ఏదోక కారు టైరో...సైకిల్ చక్రమో తిప్పుకోవచ్చు కానీ..జనం చెవుల్లో పువ్వులు పెట్టకండి

Comments