కేటీఆర్ జగన్ సీక్రెట్ మీటింగ్..ఇకనైనా లోకేష్ కనికరిస్తాడా...మరి?


మంత్రి గారు ఓ పే...ద్ద సీక్రెట్ తెలుసుకున్నారు..బైటపెట్టేశారు..దాంతో అసలు డేటా వార్‌లో ఏం జరుగుతుందో..ఎవరిది తప్పో తెలీనివాళ్లంతా మంత్రిగారి ప్రెస్‌మీట్‌తో అసలు వాస్తవం గ్రహించేశారు..ఇంతకీ మంత్రిగారు చెప్పిందేంటంటే..వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి..టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీక్రెట్‌గా ఓ చోట కలుసుకున్నారట..అంతేకాదు..అసలు వాళ్ల మీటింగ్‌ని ఏర్పాటు చేసింది కూడా బిజెపి ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ అట..ఇంకో పేద్ద..రహస్యం ఏంటో తెలుసా..ఈ సీక్రెట్ మీటింగ్‌లో డబ్బులు మార్పిడి జరిగిందట..
మరీ ఇన్ని..అటలా...అని అనొద్దు..ఎందుకంటే మరి ఇదంతా చెప్పింది కూడా మంత్రిగారే..!

వాళ్ల సీక్రెట్ ‌మీటింగ్ జరిగిందే అనుకుందాం..దానికీ ఈ డేటా థెప్ట్ కేసుకీ సంబంధం ఏంటి..సరే ఏదో ఉందనే అనుకుంందాం..దాన్ని బిజెపి సెట్ చేయడం ఏంటి..ఓహో...అంటే వేరే ఇంకెవరో సెట్ చేస్తే కానీ అవ్వని  స్థాయిలోనే ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్  తెలంగాణ రాష్ట్రసమితి సంబంధాలు ఆగిపోయి ఉన్నాయా..పోయిన నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్లి మరీ కల్వకుంట్ల తారకరామారావ్ కలిసింది జస్ట్ ఊరికినేనా..ఇప్పుడు కలిసిందే ఫైనలా..

మంత్రిగారి మాటల్లో డొల్లతనం ఎలా ఉందో చూడండి..అసలు జగన్ కేటీఆర్ ఇప్పుడు కాదు కనీసం 3 ఏళ్ల నుంచే టచ్ లో ఉన్నారు..అది ఎట్ హోమ్ మీట్స్‌లోనే బైటపడింది..సరే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఇంకా జగన్‌ని కలవడం సీక్రెట్ గా అని చెప్పుకోవడంలో టిడిపికి ఆనందం ఉఁదేమో కానీ..ఇంకెవరికీ లేదు. ఎందుకంటే ఓపెన్‌గానే ఇద్దరూ కలుసుకుంటుంటే..ఇలా సీక్రెసీ ఆపాదించి..అందులో టిడిపిపై కుట్ర చేస్తున్నారని వాపోవడం హాస్యచతురతకి గీటురాయి..ఓపెన్‌గానే కేసీఆర్, కేటీఆర్ ఎన్నోసార్లు టిడిపిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం రిటన్ గిఫ్ట్ తప్పదు అంటుంటే..మళ్లీ దానికి కుట్ర అనే పేరేెందుకు పెట్టుకుంటారు
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లోకి బాబు ఎప్పుడైనా రావచ్చు..కానీ ఆ తలుపు ఆయనే మూసేసాడు..కాంగ్రెస్ తో కలిసి మాత్రమే ముందుకెళ్తా అన్నాడు..సో ఇక అప్పుడు మిగిలిన ఆప్షన్ జగన్ మోహన్ రెడ్డి..పైగా స్వింగ్ ఆయనవైపు ఉంది అంటున్నారు. (2014కి ముందు కూడా ఇలానే అన్నారు అది వేరే విషయం) అలాంటప్పుడు వారిద్దరూ కలిస్తే..బాబెందుకు ఏడ్వాలి..ఆ లెక్కకి వస్తే అసలు 2019 ఎన్నికల తర్వాత బాబు తిరిగి ఎటు మళ్లుతారో ఎవరికి తెలుసు? ఇక రెండో ఆరోపణ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీటింగ్ అరేంజ్ చేశారనడమే..ఇంతోటిదానికి ఇంకొకళ్లు చేయడానికి..అసలు కన్నాకి కేటీఆర్ కి ఎంతమేర పరిచయం ఉందో తెలుసుకోవాలిగా..సరే పాలిటిక్స్‌లో ఏమైనా అంటాం  అంటే సరిపోయిందా.. ఇక మీటింగ్‌లో డబ్బు మార్పిడి జరిగిందట..సరే దీన్నీ నమ్ముదాం..ఎవరు ఎవరికి ఎంతెంత ఇచ్చారో కూడా చెప్పేస్తే..ఐటీ డిపార్ట్‌మెంట్‌కి ఏదైనా ఉపయోగపడుతుందిగా..ఎందుకంటే మీరు మంత్రి హోదాలో ఉండి సామాన్యుడిలాగా ఆరోపణలు చేసేసి..చూశారా నా తడాఖా అంటే ఎలా?
ఐనా ఇవన్నీ చినబాబు తిరిగి మీకు సీటు ఇప్పించడంలో సాయపడతారనే చేస్తున్నారని ఎవరైనా ఆరోపిస్తే మాత్రం మేం నమ్మంలెండి

Comments