చంద్రబాబు, మమతాబెనర్జీ,కేజ్రీవాల్, అఖిలేష్ సహా 23 పార్టీలకు చేతకానిది..ఈ బక్కోళ్లు చేసి చూపించారు శభాష్


రైతే రాజు..ఎన్నాళ్ల నుంచి వింటున్నాం ఈ స్లోగన్..ఎప్పుడన్నా  అయ్యాడా రాజు..రాజు సంగతి సరే ఏనాడైనా ఒక్క రైతు కథని దేశం మొత్తం విన్నదా..ఇదిగో ఇప్పుడు వింటది..పంటలకు గిట్టుబాటు ధరలు కావాలి..కావాలి ఇవ్వండి అని మొరపెట్టుకున్నా వినకపోవడంతో..పౌరుషం చూపించేందుకు సిధ్దం అయ్యారు..

నిజామాబాద్ స్థానంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పోటీ చేస్తున్నాయ్..కానీ ఈ సీటు నుంచే 150కి పైగా రైతులు కూడా నామినేషన్ వేసారు..ఏదో గెలిచేద్దామనో..డబ్బులు సంపాదించుకుందామనో కాదు..తమ సమస్యలు అయ్యా బాబూ అంటే విన్పించుకోలేదు కదా..తమకే దారీ లేదనే కదా..ఈ లీడర్ల దౌర్జన్యం..

ఒకళ్లేమో పోయి..వారణాసి, అమేథీలో నామినేషన్లు వేసుకోమంటారు..ఇంకొకళ్లమే మేనిఫెస్టోలో పెడతామంటారు..ఏం పసుపు మొక్కజొన్న కొత్తగా భూమి నుంచి ఊడిపడ్డాయా...సమస్యల గురించి తప్పించుకోవడానికి ..నంగనాచి కబుర్లు చెప్పడానికి..ఇప్పుడు సరిపోయింది కదా..ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీడియా పట్టించుకుంటుంది..ఇక్కడ ఎందుకు బ్యాలెట్ పేపర్ తో ఎన్నిక జరపాల్సి వచ్చిందో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తాయ్..రేపు రిజల్ట్ వచ్చేరోజు కూడా ఓ ర ోజు లేట్ అవుతుంది..అప్పుడూ రాస్తారు..అప్పుడైన బుద్ది వస్తుందేమో...ఇదే పద్దతి అందరూ ఫాలో అవ్వాలి

ఇక్కడే కలిసికట్టుగా ఉంటే...ఉపాయంతో ఎలా సమస్యని గట్టెక్కాలో కూడా( పరిష్కారం అయిపోయిందనడం లేదు..మార్గం కన్పిస్తుంది) తెలుస్తుంది..ఈవిఎం వద్దు..ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ కావాలి అని 22, 23 పార్టీలూ ఈసీ చుట్టూ తిరిగాయ్ కదా..కానీ నిజామాబాద్ నామినేషన్ల ఎపిసోడ్ ఏం చెప్తుందో చూడండి..96 నామినేషన్లు దాటితే బ్యాలెట్ పేపరేనట..మరి అర్ధమైందా..ఏం చేయాలో..వేయించండి నామినేషన్లు కనబడ్డ ప్రతి కార్యకర్త చేతా..చచ్చినట్లు బ్యాలెట్ పేపర్‌తోనే ఎన్నిక జరిపిస్తారు..కానీ..ఆలస్యమైపోయింది గురూ..బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ బాబూ

Comments