తెలుగుదేశానికి 150 సీట్లు..చంద్రబాబు గారి లెక్కేంటి

తెలుగు దేశం అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు..ఢిల్లీ నుంచి విజయవాడకి విజయవాడనుంచి కర్నాటకకు చక్కర్లు కొడుతూనే మధ్యలో తన పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో ఓ అంచనా వేశారు..దానికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు..మా నియోజకవర్గంలో గెలిచేదే మేము లేదంటే ఎంత పందేనికైనా సిధ్దం అంటూ తొడగొట్టుకున్నారు కూడా...వాస్తవంగా ఫలితం అనేది మే 23న కౌంటింగ్ లోనే తెలుస్తుంది..ఐనా ఏ పార్టీకి ఆ పార్టీ ఇలా ఇన్ని సీట్లు గెలుస్తుందని చెప్పుకోవడం విశేషమే


ఐతే జగన్ తన గెలుపుపై ఇంతవరకూ ఇన్ని సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు. చంద్రబాబునాయుడు గారు మాత్రం 110 సీట్లు ఖాయంగా చెప్తున్నారు..దానికి ఆయన దగ్గరున్న అంచనా ఏంటంటే..కేవలం ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో మళ్లీ ఓటర్లు బారులు తీరి ఓటేశారానేది..కొంతవరకూ ఈ విషయం నిజమే అనుకుందాం..కానీ 75శాతం పోలింగ్ జరిగినప్పుడు ఓ పది పోలింగ్ బూత్‌ల దగ్గరో అర్ధరాత్రి వరకూ జరిగితే..అదంతా టిడిపికి అనుకూలమనే ఎందుకు అనుకోవాలి..
ఎటూ ఓటమికి కారణాలు..సాకులు వెతుక్కోవాలి కాబట్టి..ఇలా హడావుడి చేస్తున్నారు ఈ విమర్శలో కాస్త కూడా వాస్తవం లేదా..దీనికి ఎవరి సమాధానం వారిది..రేపు ఫలితం వచ్చిన తర్వాత చెప్పే సమాధానమే  ఈ ప్రశ్నకీ సమాధానం చెప్తుంది..ఐతే 150 సీట్లు...అంతకంటే కూడా ఎక్కువ వస్తాయంటన్నారు అదెలా ? ఏఏ స్థానాల్లో గెలిస్తే..అంత విజయం సాధ్యమవుతుందో చెప్పగలరా. కనీసం  ఉభయగోదావరి జిల్లాల్లో సగం సీట్లు..గుంటూరు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కనీసం అంటే కనీసం వైఎస్సార్సీపీకి ఐదైదు చొప్పున గెలుపు ఖాయం అంటున్నారు.అంటే ఇక్కడే మనకి వైఎస్సార్ కాంగ్రెస్ కి వచ్చే సీట్లు 38 కన్పిస్తున్నాయ్( ఇవి హీనపక్షం వచ్చే సీట్లు) మరిక టిడిపికి 150 ఎలా వస్తాయ్..విజయసాయిరెడ్డి చెప్పినట్లు చంద్రబాబుగారు 180 సీట్లు వస్తాయని కూడా చెప్తారేమో

Comments