ఔను...థ్యాంక్స్ శివాజీ..నిజం చెప్పావ్..!


శివాజీకి నిజంగా రాష్ట్రమంతా కాదు..వీలైతే దేశం మొత్తం ఋణపడి ఉంటాం..ఎందుకంటే..ప్రపంచంలో ఏది చేయాలన్నా..అది  ఆ బాబుగోరికే సాధ్యమవుతుందని చెప్పడమే నీ ధ్యేయం.. నీతపన..నీ తాపత్రయం..నీ లక్ష్యం అమోఘం గురూ,ఐనా నీకిన్ని తెలివితేటలు ఎక్కడవి గురూ..రకరకాల యేషాలు..వాటిని మళ్లీ ఏదో పెద్ద సమాజ ఉధ్దారకుడిలా బిల్డప్ తో వీడియో...ఆ తర్వాత వీడియో ప్రజెంటేషన్..సూపర్బ్ ప్లాన్ గురూ..

నువ్వేం చెప్తావో..అందరికీ తెలుసు..నీ బతుకుకి అర్ధం ఇచ్చిన..ఆ మాటకి వస్తే అశేషాంద్ర ప్రజలకు రోజూ నోట్లోకి వేళ్లు వెళ్తున్నాయంట ేమీ బాబుగారే కారణం అని చెప్పుకోవడమే కదా,ఎందుకు గురూ ఇన్ని వేషాలు, బతికి ఉన్నంతవరకూ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి, లోకేష్ కూడా వద్దు..అని ఢంకా భజాయించి చెప్పు ఆయనకి పదవి అంటే వ్యామోహం లేదు  కానీ..మీలాంటి సమాజాభివృధ్ది కోరుకునేవాళ్లు..జనహితం కోరుకునేవాళ్లే కదా..
బలవంతంగా పదవి అప్పజెప్తున్నారు ప్రతిసారీ...మా బతుకులు సల్లంగా ఉండాలంటే మీ బాబుగారినే ప్రధానిగా కూడా ఉఁడాలని చెప్పు గురూ..అంతేకానీ, ఎన్నాళ్లీ తడికచాటు రాయబేరాలు

అందరికీ ఓపెన్‌గా కన్పిస్తూ..యూట్యూబ్‌లో కొన్ని లక్షలమందికి కన్పిస్తున్న వీడియోలను ఏదో పెద్ద శోధన చేసి బైటికి తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇచ్చి నీకిష్టమైనట్లుగా అర్ధం వచ్చేట్లుగా వ్యాఖ్యానించడం..పైగా అమరావతి గురించి చెప్పడం..ఇంత కన్నా అశుద్దం తిని బతకవచ్చుకదా..అసలు ఆ మీటింగ్ ఏదో..ఆ వీడియో ఏదో ...తెలీకుండా వాగడం..పైగా నువ్వే అది 3,4 నెలల క్రితం అని చెప్పావ్..అందులో క్లియర్ గా రెండేళ్ల తర్వాత అని జగన్ ఏదో విషయం గురించి చెప్తున్నాడంటే..అది ఖచ్చితంగా 2017లో అయి ఉండాలి..లేదూ శివాజీ చెప్పినట్లుగా 4నెలల క్రితం అనుకుంటే. అది 2021 తర్వాతే కదా జరగాల్సింది..అంటే అప్పుడు జగన్ గెలవాలి..మరి ఆ గెలుపు సాధ్యమైతే..శివాజీ చెప్పిన తరలింపు రెండేళ్లు ఆగడం ఎందుకు..బుద్ది లేకుండా వాగి..ఓటర్లని ఖరాబ్ చేయడానికే కదా

ఇంకోటి విలీనం అంట..ఇది 2012 నుంచీ అందరూ ఇలా చెప్తున్నదే..ఏనాడైనా జరిగిందా అది..కడప బై ఎలక్షన్ టైమ్‌లో ఇదే చెప్పారు..తర్వాత కాంగ్రెస్ లో కలసిపోతుందని చెప్పారు..ఇప్పుడదే వాదన కదా..మళ్లీ నువ్ తెచ్చింది..సిగ్గుందా..నీకు..నీ కులాభిమానానికి జోహార్లు గురూ..ఎందుకంటే నువ్ చేసే ఆరోపణలకు ఆధారాలు తేలేవట..మేం మాత్రం నువ్ చెప్పే ప్రతి సోది కబురుకీ చప్పట్లు కొట్టాలట..కథానాయకుడు..మహానాయకుడు థియేటర్లలో ట్రైలర్‌లాగా వేసుకో గురూ నీ బొమ్మని..అమెజాన్ ప్రైమ్‌లో
మర్చిపోయారే...అ.జో..గా..శివాజీ బైటపెట్టిన భయంకరమైన కుట్ర అని..శివాజీ బైటపెట్టిన సంచలన వాస్తవాలు అంటూ రాస్కొని శునకానందం పొందురో...!

Comments