బట్టలిప్పేస్తే..పాపులారిటీ పెరుగుతుందా..ఏంటీ వైపరీత్యం


సోఫియా హయత్ అని ఒకావిడ ఉంది. ఆ మధ్యన బుద్దిజం తీసుకున్నానంటూ హడావుడి చేసింది. ఆ తర్వాత మరో మతం అన్నది..క్రీస్తే నా కడుపున పుట్టబోతున్నాడంటూ చెప్పుకుంది..ఐనా సరే జనాలకు ఈమె మీద నమ్మకం ఏర్పడలా..సినిమా ఛాన్సులు రాలా..రోహిత్ శర్మతో డేటింగ్ చేశానంటూ చెప్పుకొచ్చింది. అసలు అతగాడు మామూలోడు కాదు..మంచోడు కాదు అంటూ రకరకాల కామెంట్లు పెట్టినా..ఎవ్వరూ పట్టించుకోలేదు. కొంతమందైతే..ఈమె మరో పూనమ్ పాండేలా తయారైందే అంటూ గుసగుసలాడుకున్నారు..

ఇప్పుడు తాజాగా బర్త్‌డే బేబీలాగా తయారైపోయి..ఫోజులిచ్చేసింది..దీంతో చాలామందికి నోరూరింది..బైటికి చెప్పలేదు కానీ..కొంతమంది మాత్రం టోల్ తీసేస్తున్నారు. నిన్ను పుట్టించిన దేవుడికే సిగ్గు పుట్టించేలా బిహేవ్ చేయొద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు


ఎందుకంటే..ఈ లేడీ  ఓ మసాజ్ సెంటర్లో మర్దనా చేయించుకుని..తర్వాత పాదాలపై పచ్చబొట్టు వేయించుకుంది..అదేంటో తెలుసా అరికాళ్లలో స్వస్తిక్ సింబల్..బహుశా ఇలాగైతే హిందూవర్గం జనం దండెత్తి వస్తారని ఊహించుకుందేమో..అలాగైనా నలుగురి నోళ్లలో నాలుగురోజులు నానొచ్చు..అలా ఏదోక సినిమానో..సింగిల్ సాంగో
దక్కించుకోవచ్చు అనేది ఆమె ఫీలింగ్‌లా కన్పిస్తుంది..ఏమైనా రామ్ గోపాల్ వర్మ కాస్త దృష్టి పెట్టి..ఏ జీఎస్టీ త్రీనో..ఫోరో ప్లాన్ చేసుకుంటే తప్ప ఈమె తిప్పలు తప్పేలా
లేవ్

Comments