ముందు ఈవిఎంలు..తర్వాత వివిప్యాట్ స్లిప్స్..చంద్రబాబు వాదనలో డొల్లతనం బైటపెట్టిన జగన్

వేసిన ఓట్లు వేయాలనుకున్న పార్టీకి పడకపోతే..ఎవరైనా ఊరుకుంటారా..అందులోనూ చంద్రబాబునాయుడు గారు ఊరుకుంటారా.? ఇదీ జగన్ వేసిన మొదటి ప్రశ్న.. ఇన్ని రోజులూ చంద్రబాబునాయుడు గారు ఢిల్లీ నుంచి అమరావతి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా నా ఓటెవరికి వేసానో నాకే తెలీదు..ఈవిఎంలు పని చేయడం లేదు..మా పోరాటం వాటిపైనే అంటూ ఊదరగొట్టారు..దీనికి ఎదురు చెప్పింది లేదు..ఎదురు ప్రశ్న వేసింది లేదు..

ఎందుకంటే ఎదురు ప్రశ్న వేస్తే..అది సాక్షి పత్రిక అనో..అప్పోజిషన్ పార్టీ అనో కళ్లెర్రజేయడం మామూలే కదా..
ఇప్పుడు వైఎస్ జగన్ అడిగాడు కాబట్టి..దీనికి కౌంటర్ తప్పకుండా చంద్రబాబు గారు ఇస్తారు..
80శాతం కాకపోయినా...75శాతం మంది పోలింగ్ లో పాల్గొ్న్నారు..దానికి తోడు ఎలక్షన్ ఏజెంట్లు మాక్ పోలింగ్ అంతా బావుంది అన్నాకనే సైన్ తీసుకున్నాకనే అసలు పోలింగ్ ప్రారంభం అవుతుంది అనే విషయం తెలియజెప్పారు కదా..ఈవిఎంలు పని చేయకపోవడం వేరు..స్లోగా పని చేయడం వేరు..
ఆధార్ కార్డు నమోదు చేయించుకోవడానికి వెళ్లినప్పుడు ఎంత టైమ్ క్యూల్లో నిలబడాల్సి వచ్చిందో గుర్తుంది కదా..అలాని ఆధార్ తీసుకోవద్దని ఏ లీడరైనా చెప్పాడా..చెప్పి ఉంటే..ఇప్పుడు చంద్రబాబుగారి వాదనకీ మద్దతు దొరికి ఉండేది

Comments