మోహన్‌బాబుకి శిక్ష..కేసు పెట్టింది..వైవిఎస్ చౌదరి..కేసు పదేళ్లనాటిది


మోహన్‌బాబుకి శిక్ష..కేసు పెట్టింది..వైవిఎస్ చౌదరి..కేసు పదేళ్లనాటిది
హ హ..ఎప్పటి కేసు..ఎప్పుడు కదిలింది..అది కూడా పాపం మోహన్ బాబు టిడిపిపై విరుచుకుపడుతున్న తర్వాత..ఇది చాలు కదా..ఎవరు ఏ వ్యవస్థలను వాడుకుంటుంది చెప్పడానికి
నాట్ బిఫోర్ నాటకాలు..అదే పనిగా స్టే తెచ్చుకోవడాలు చేతకానివారికి...ఇలా ఇన్‌స్టంట్ శిక్షలు పడుతుంటాయ్..అదే ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలిగితే చాలు..ఒక్క కేసూ లేకుండా
ఊరూరా ఊదరగొడుతూ ప్రచారాలు చేసుకోవచ్చు..ఇదే మోహన్ బాబు కేసు చూస్తే అర్ధం చేసుకోవచ్చు.

ఎప్పుడో పదేళ్లనాటి కేసులో ఫలానా కోర్టు శిక్ష వేసింది అనగానే..ఓ వర్గంలో తెగ సంబరాలు..అక్కడికేదో పడింది దారుణమైన హత్యకేసులో శిక్ష అయినట్లు..చెక్ బౌన్స్ కేసు..ఇదే తరహా కేసులో
పత్రికాధిపతులకు కూడా శిక్ష పడిన సంగతి వాళ్లు మర్చిపోవచ్చు కానీ జనం కాదు..అలానే అమ్మ జగనూ..అయ్య జగనూ అనుకుంటూ తెగ కిచెన్ స్టోరీలు వండేసి..కోర్టు మొట్టికాయలు వేస్తే..
కనీసం వాటి మెట్లు కూడా ఎక్కకుండా తెగ తిరిగి చివరికి బెయిల్ దొరకడంతో ఊరటపొందిన చేగువేరాలూ ఉన్నారు..అలాంటిది మోహన్ బాబు చెక్ బౌన్స్ కేసు పెద్ద విషయం ఏముంది

పైగా ఇందులో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది..వచ్చిన తర్వాత ఇక మోహన్ బాబు ఎలా రెచ్చిపోతారో చూడాలి
ఎందుకంటే నిర్మాతగా సలీం సినిమా తనకి 13కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చాలా ఏళ్ల క్రితమే చెప్పాడాయన. అలాంటిది..ఆప్పటి రెమ్యునరేషన్ వ్యవహారంపై ఇప్పుడు తీర్పు వచ్చేలా
చేశారంటే..మతలబు అందరికీ అర్ధం అవుతూనే ఉంది. ఈ 9ఏళ్లలో వైవిఎస్ చౌదరి తీసిన సినిమాలు..అవి నిర్మాతలకు కలిగించిన నష్టాలేమోకానీ..ఆయన్నే ఆర్ధికంగా చితికేలా చేశాయంటే
అతిశయోక్తి కాదు..మరి పాపం ఇప్పుడు మోహన్‌బాబు ఇచ్చే నష్టపరిహారంతో కాస్తైనా బైటపడతాడేమో చూడాలి..

Comments