వాహ్వా..ప్రైమ్ మినిస్టర్ మీరేనా..? చంద్రబాబు తీరుతో స్టాలిన్ బెంబేలు..అందుకే కలవలేదా


అందుకే ఏ పార్టీ అయినా..మనకీ సొంతంగా ఓ పేపర్ ఉండాలి..మనకీ ఈదినం..ఆ.జో లాంటి పేపర్లు ఉండాలి అని కోరుకుంటారు. ఐతే వాళ్లందరికీ ఓ రావ్ జీ..ఓ రాకీజీలు దొరకరు కదా..ఇచ్చిన పని నిబద్దతతో చేస్తూ..ఆవులించినా సరే అబ్బా...సార్ ఏం ఆవులించారు..సార్ ఆవులింత చూసి..మిగిలినవాళ్లు దడుచుకున్నారు..ఆయన ఆవులిస్తే...ఇవతలి వాళ్ల పేగులే లెక్కపెడతారు సుమా..అన్నట్లుగా రాతలు రాయడం సాధ్యం కాదు కదా..అందుకే ఛత్...మిగిలిన పేపర్లకి ప్రజాదరణ కరువు


పైన క్లిప్పింగే చూడండి..చంద్రబాబునాయుడు గారు చెన్నైలో ప్రచారానికి వెళ్లారట..కానీ అక్కడ ఏదైనా రోడ్‌షో కి వెళ్లారా లేదు..జస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు..ఇదిగో ఈ ముగ్గురు అభ్యర్ధులను గెలిపించండి అని అడిగారు..పైగా ప్రధానమంత్రి మారతారు అని చెప్పడమే తప్పు..బిజెపి ఓడిపోతుందనలేదు..ఓకే ఆ రెండూ అర్ధం ఒకటే అనుకుందాం..మోడీ స్థానంలో స్టాలిన్ ఉన్నా బ్రంహ్మాండంగా పని చేస్తారని చెప్పడం ఏంటి..ఆలెక్కన స్టాలిన్ ని తీసిపారేయడమా..సరే అదీ వదిలేద్దాం..ఎన్నికల తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమట..బాబూ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు 2016లో జరిగాయి..తిరిగి 2021 వరకూ పళనిస్వామి పన్నీర్ స్వామి హ్యాపీగా కలిసి పాలించుకోబోతున్నారు..ఢిల్లీలో మోడీ ఉన్నా పోయినా..వాళ్లకి లెక్కలేదు..ఐదే రెండేళ్ల తర్వాత జరగబోయేది ఇప్పుడే ఎందుకు చెప్పుకోవడం..

సరే అది మీ అభిభాషణ కావచ్చు..కానీ ఆ తర్వాత లైన్లలోనే ఉంది అసలు నాటకం..అక్కడ చేరిన ఎవరో..(పాపం అడిగిన విలేకరి ఎవరో సదరు పత్రికకి తెలీదట..నమ్మాలా) కాంగ్రెస్, బిజెపి, మెజారిటీ రాకపోతే మీరే పిఎం అభ్యర్ధి అటకదా అన్నారట..దానికేమో ఆయన చర్చించి చెప్తామన్నారట..అంటే అక్కడికేదో..దేశం మొత్తం మీ వెనుకబడుతుందనే కదా ఈ రాతల అర్ధం..ఇంత చేసి మీ మద్దతు కోరిన స్టాలిన్ మహాశయులు మీకు  మొహం ఎందుకు చాటేశారో చెప్పండి..ప్రచారం చివరిరోజున మీరేదే ఇరగదీస్తానంటే వద్దన్నారా...ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత మీకోసం నేషనల్..రీజినల్ ఛానళ్లు ఎగబడ్డాయా..వాహ్వా..ఇలాంటి కథనాలు సాక్షికి లేకనే కదా..ఆ ఛానల్..పత్రిక పరిస్థితి అలా అధ్వాన్నంగా తగలబడింది..
నిజంగానే మీరన్నట్లు..ఇదిగో ఇలా చేయాల్సిందే సాక్షి సిబ్బందికి



Comments