జబర్దస్త్ సర్వీస్ అయితే..మరి ఎంపి పదవి...నాగేంద్రబాబు ఎంచుకునే ఛాన్స్ ఇస్తారా జనం


జబర్దస్త్ ఎలాంటి సేవ చేస్తుందో జనానికి అందరికీ తెలుసు కానీ..జనసేన పార్టీ వాళ్లకి మాత్రం అదో విడిచిపెట్టరాని వినోదంగా తోస్తోంది..అందుకే నాగేంద్రబాబు ఉరఫ్ నాగబాబు గారు తన స్నేహితుడు మెహర్ రమేష్ తో కలిసి ఆయన సొంత ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కమ్ చిట్ చాట్ లో జబర్దస్త్ ని వదలనంటూ చెప్పారు.

వాస్తవానికి నరసాపురంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేయాల్సిన నాగబాబు సదరు ఇంటర్వ్యూలో నేను నరసాపురం ఎంపిగా గెలిచినా..ఈ షో కంటిన్యూ చేస్తాను అని చెప్పడం ఆయన సందేహాన్నే తెలియజేస్తోంది..నిజం చెప్పాలంటే జబర్దస్త్ ఓ సర్వీస్ అంటూ మొదలు పెట్టిన ఆయన సమాధానం కూాడ కాస్త పదాల వాడుకలో అవగాహన లేమిని సూచిస్తోంది..ఏ షో అయినా డబ్బులే ఇస్తారు..కానీ అది సేవ అనుకుంటే పొరబాటు..ఆ  లెక్కన అప్పుడెప్పుడో షకిలా కూడా బోలెడంత సమాజసేవ చేసిందనుకోవాలి..( నిజానికి ఆమెతో సినిమాలు తీసుకుని కనీసం పదిమంది నిర్మాతలు పేదరికం నుంచి గట్టెక్కారట) అదేదో సినిమాలో తాగుబోతు క్యారెక్టర్లు చేసే ఎంఎస్ నారాయణ చెప్పినట్లు..నిజమైన సేవకులంటే జయమాలిని..జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత అని అంటాడు..ఎందుకంటే జనానికి బోలెడంత వినోదం పంచారట. 
ఇప్పుడలానే జబర్దస్త్ తో కూడా బూతు వినోదం పంచి..అదే హాస్యం అనుకోమంటున్నారు..నిజంగా నాగేంద్రబాబు ఎంపిగా గెలిస్తే..తప్పకుండా ఆ షో చేయడు..ఎందుకంటే అప్పుడొచ్చే విమర్శలను తట్టుకోవడానికి ఆయన రోజా కాదు..జస్ట్ నాగేంద్రబాబు..యండమూరి ఏదో అన్నాడని..ఓపెన్ గా విరుచుకుపడిన నాగబాబు..అప్పుడొచ్చే విమర్శలను తట్టుకోలేడనండంలో గ్యారంటీ మరి..జనం ఆయనకా ఛాన్స్ ఇస్తారా 

Comments